జాబిలిపైకి మనుషులు.. నాసా ట్రైనింగ్

జాబిలిపైకి మనుషులు.. నాసా ట్రైనింగ్

ఆస్ట్రోనాట్లకు నాసా నీళ్లలో ట్రైనింగ్ ఇస్తోంది. ఎందుకో తెలుసా?  చందమామపైకి మళ్లీ మనిషిని పంపుతోంది కదా. 2024లో ‘ఆర్టిమిస్’ ప్రయోగం చేయబోతోంది. అందుకే, చంద్రుడిపై అడుగుపెట్టే ఆస్ట్రో నాట్లకు నీళ్లలో శిక్షణ ఇస్తోంది. అది కూడా చెరువులో, లేదంటే కాల్వల్లో అనుకుంటే పొరపాటే. అందుకోసం ప్రత్యేకంగా ఓ నీటి ట్యాంకును ఏర్పాటు చేసింది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ.

NASA going to send Man to Moon

ఎందుకు నీటి అడుగున ఇస్తోందో తెలుసా? జాబిలి మీద గురుత్వాకర్షణ తక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే కదా. ఆ గ్రావిటీని, దాని వల్ల ఎదురయ్యే సవాళ్లను తట్టుకునేందుకే ఈ ఏర్పాటన్నమాట. నీళ్లలో కూడా గ్రావిటీ తక్కువగా ఉంటుంది. అందుకే హ్యూస్టన్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్ లో ఉన్న న్యూట్రల్ బుయాన్సీ ల్యాబ్ లో ఓ పెద్ద వాటర్ ట్యాంకును ఏర్పాటు చేయించి ఆస్ట్రోనాట్లను అక్కడి  పరిస్థితులకు రెడీ చేస్తోంది నాసా. అందులో భాగంగా ఇద్దరు ఆస్ట్రోనాట్లకు ఈ నెల ప్రారంభంలో ట్రైనింగ్ మొదలుపెట్టింది. డ్రూ ఫ్యూస్టె ల్ , డాన్ పెటిట్ లకు ట్రైనింగ్ ఇచ్చింది. దానికి సంబంధించిన ఫొటోను ఈమధ్యే విడుదల చేసింది.