
వాషింగ్టన్: మార్స్ పై ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్ ఎగురుతున్న వీడియోను అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా ఆదివారం రిలీజ్ చేసింది. ఏలియన్ డిసర్ట్పై నాసా తన 50వ ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్ ఫ్లైయింగ్‌ను పూర్తి చేసింది. ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్ ఏప్రిల్ 13వ తేదీన 145.7 సెకన్స్‌లో 322.2 మీటర్లు ప్రయాణించింది. 60 అడుగుల ఎత్తు వరకు వెళ్లి రికార్డు సృష్టించింది. ఇది తమ అన్ని అంచనాలను మించిపోయిందని నాసా ప్రకటించింది. 47వ సారి ట్రావెల్ చేసినప్పుడు కూడా నాసా వీడియో రిలీజ్ చేసింది. 2023 మార్చి 9న నాసాకు చెందిన ‘పర్సీవెరెన్స్ రోవర్’లో ఉన్న ‘మాస్ట్‌క్యామ్ జడ్’ ఇమేజర్ఈ వీడియోను క్యాప్చర్ చేసింది.
వీడియో తీసిన టైంలో.. రోవర్, హెలికాప్టర్ నుంచి 394 అడుగుల (120 మీటర్లు) దూరంలో ఉంది. ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్ 800 మీటర్ల వెడల్పు గల ‘బెల్వా క్రేటర్’ దగ్గర దిగడానికి ముందు 18 మీటర్ల ఎత్తు వరకు వెళ్లింది. హెలికాప్టర్ గాల్లో ఎగిరిన ప్రతీసారి సరికొత్త రికార్డును సృష్టించిందని నాసా తెలిపింది. ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్ 2021 ఫిబ్రవరిలో రోవర్‌తో కలిసి మార్స్‌పై ల్యాండ్ అయ్యిందని, 2021 ఏప్రిల్ 19న ఫస్ట్ టైం గాల్లో ఎగిరిందని వివరించింది. మరింత సవాళ్లతో కూడిన భూభాగంలో ఎగిరించేందుకు ప్రయత్నిస్తామని ప్రకటించింది. దీని కోసం హెలికాప్టర్ రోవర్‌కు చెందిన మరిన్ని ఎలక్ట్రానిక్ ఇయర్షాట్స్ అవసరం అవుతాయని తెలిపింది.