హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ఆపరేషన్స్ కి చీఫ్​గా కేథీ

హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ఆపరేషన్స్ కి చీఫ్​గా కేథీ
  • తొలిసారి మహిళను ఎంపిక చేసిన నాసా

వాషింగ్టన్: చంద్ర మండలానికి తాము పంపే మానవ సహిత అంతరిక్ష ప్రయోగం కార్యక్రమానికి హెడ్ గా ఓ మహిళను నాసా ఎంపిక చేసింది. 2024లో చంద్రుడిపైకి మానవ సహిత లాంచ్ ప్రయోగాలకు ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్న నాసా.. హ్యూమన్ ఎక్స్ ప్లోరేషన్స్ అండ్ ఆపరేషన్స్ డైరెక్టరేట్​కి హెడ్​గా కేథీ లూడర్స్ ని ఎంపిక చేశామని నాసా చీఫ్​ జిమ్ బ్రిడెన్ స్టెయిన్ ట్విట్టర్ లో ప్రకటించారు. 2024లో తాము చేపట్టబోయే ప్రయోగాన్ని నిర్వహించేందుకు కేథీ సరైన వ్యక్తి అని పేర్కొన్నారు. 1992 లో నాసాలో చేరిన కేథీ లూడర్స్ తన కేరీర్ లో కమర్షియల్ క్రూ, కమర్షియల్ కార్గో ప్రోగ్రామ్​లను సక్సెస్​ఫుల్ గా నిర్వహించారు. కిందటి నెల 30 న ఆమెరికాలోని ఫ్లోరిడా స్టేషన్ నుంచి స్పెస్ ఎక్స్ రాకెట్ ద్వారా ఇద్దరు ఆస్ట్రొనాట్స్ ని స్పేస్ స్టేషన్ కు పంపిన ప్రయోగాన్ని కేథీ పర్యవేక్షించారు.