
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి చంద్రయాన్ 3 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. మొత్తం మూడు దశలనూ దాటుకుని రాకెట్ కక్ష్యలోకి దూసుకెళ్లింది. కొన్ని గంటల క్రితం ప్రపల్షన్ మాడ్యూల్ రాకెట్ నుంచి విడిపోయినట్టు ప్రకటించిన ఇస్రో ఛైర్మన్.. చంద్రయాన్ 3 ఉపగ్రహం చంద్రుడి వైపుగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిందని ప్రకటించారు. ఆగస్టు 23 లేదా 24 న చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ సురక్షితంగా ల్యాండ్ అవుతుందని ఇస్రో అంచనా వేస్తోంది.
చంద్రయాన్ 3 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించినందుకు గానూ ఇస్రోపై నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) ప్రశంసలు కురిపించింది. చంద్రయాన్-3 ప్రయోగంలో, ల్యాండర్ సురక్షితంగా చంద్రునిపైకి చేరుకోవాలని ఆకాక్షించింది. నాసా యొక్క లేజర్ రెట్రో రిఫ్లెక్టర్ శ్రేణి సహా మిషన్ నుండి వచ్చే శాస్త్రీయ ఫలితాల కోసం తాము ఎదురుచూస్తున్నామని తెలిపింది.
Congratulations to @isro on the Chandrayaan-3 launch, wishing you safe travels to the Moon. We look forward to the scientific results to come from the mission, including NASA’s laser retroreflector array. India is demonstrating leadership on #ArtemisAccords! https://t.co/98nwfm12V0
— Bill Nelson (@SenBillNelson) July 14, 2023