మీ వెంట మేమున్నాం : చంద్రయాన్ 3కు మద్దతుగా రంగంలోకి అమెరికా, యూకే

మీ వెంట మేమున్నాం : చంద్రయాన్ 3కు మద్దతుగా రంగంలోకి అమెరికా, యూకే

చంద్రుడి దక్షిణ ధృవంలో ఏముందీ.. ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని కదిలిస్తుంది. ఇంత వరకు ఎవరూ చేయని సాహసం భారత్ ఇస్రో చేస్తుంది. మన కంటే వెనక వెళ్లి.. ముందుగా ల్యాండ్ అవుతుంది అనుకున్న రష్యా లూనా 25 పేలిపోవటంతో.. ఇప్పుడు మన చంద్రయాన్ 3పై దృష్టి పెట్టాయి ప్రపంచ స్పేస్ రీసెర్చ్ సెంటర్లు. చంద్రయాన్ 3ను ఎలాగైనా సాఫ్ట్ ల్యాండింగ్ చేయటానికి.. తమ వంతుగా చేతులు కలిపాయి అమెరికా రీసెర్చ్ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ). 

ఇస్రో.. మీ వెంట మేమున్నాం అంటూ తమ సహాయ సహకారాలు అందిస్తున్నాయి. ఎలాగైనా చంద్రయాన్  3ను విజయవంతం చేయాలనే లక్ష్యంతో ముందుకు వచ్చాయి. ఇప్పటి వరకు చంద్రుడి దక్షిణ ధృవంలో ల్యాండ్ అయిన శాటిలైట్ లేదు.. చంద్రయాన్ 3 మాత్రమే.. అత్యంత సమీపంలోకి వెళ్లింది.. సాఫ్ట్ ల్యాండింగ్ కు వంద శాతం అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇండియానే స్పేస్ రీసెర్చ్ ఇస్రోకు.. సాంకేతికంగానే కాకుండా.. డేటా పరంగా తమ వంతు సహకారం అందిస్తున్నాయి నాసా, యూరోపిన్ స్పేస్ ఏజెన్సీలు. 

చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ అయితే.. ఇస్రో విధానం, సాంకేతికత అనేది మిగతా అందరికీ ఉపయోగపడుతుంది. చంద్రుడిపై తదుపరి పరిశోధనలకు ఉపయోగపడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇస్రో చంద్రయాన్ 3 ల్యాండింగ్ కు.. ప్రపంచంలోని అన్ని స్పేస్ రీసెర్చ్ సెంటర్లు.. తమ తమ వంతు సహాయ సహకారాలతో ముందుకు వచ్చాయి. 

ప్రపంచంలోని 800 కోట్ల మంది ఆశలు, ఆకాంక్షలు ఇప్పుడు చంద్రయాన్ 3పై ఉన్నాయి.. భవిష్యత్ తో చందమామను జనం కూడా ముద్దాడే గమ్యస్థానం కావాలనేది అందరి ఆంక్షాలు.. మరి చంద్రయాన్ 3.. 800 కోట్ల మంది ఆశలను ఏ విధంగా నెరవేర్చుతుంది అనేది ఉత్కంఠ రేపుతోంది.