మార్కెట్లోకి నాసల్​ కొవిడ్ వ్యాక్సిన్

మార్కెట్లోకి నాసల్​ కొవిడ్ వ్యాక్సిన్
  • లాంచ్​ చేసిన కేంద్ర ఆరోగ్యమంత్రి మన్​సుఖ్​ మాండవీయ
  • ప్రైవేటులో టీకా ధర రూ.800 

న్యూఢిల్లీ : భారత్  బయోటెక్​ అభివృద్ధిచేసిన నాసల్​ కొవిడ్ వ్యాక్సిన్​ ‘ బీబీవీ154  ఇన్కో వ్యాక్​’ ఎట్టకేలకు మార్కెట్లోకి విడుదలైంది.  రిపబ్లిక్​ డే సందర్భంగా దీన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్​సుఖ్​ మాండవీయ, సైన్స్​అండ్​ టెక్నాలజీ మంత్రి జితేంద్రసింగ్​గురువారం లాంచ్​ చేశారు. ముక్కు ద్వారా వేసే ఈ  వ్యాక్సిన్ ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.325కు, ​ప్రైవేటు మార్కెట్​లో రూ.800కు  విక్రయిస్తామని భారత్​ బయోటెక్​ ప్రకటించింది.  ఇతరత్రా కొవిడ్​ వ్యాక్సిన్ల రెండు డోసులు  తీసుకున్నవారు ‘ బీబీవీ154  ఇన్కో వ్యాక్​’ను బూస్టర్​ డోసుగా వేయించుకోవచ్చు.  

మొదటి డోసును వేసిన 28 రోజుల తర్వాత రెండో డోసు వేస్తారు.  నాసల్​ వ్యాక్సిన్​ ఒక్కో డోసులో భాగంగా ఒక్కో ముక్కురంధ్రంలోకి చెరో నాలుగు వ్యాక్సిన్​ డ్రాప్స్​ వేస్తారు.  అయితే ఇప్పటికే బూస్టర్/ప్రికాషన్​ డోసు  తీసుకున్న వారికి నాసల్​ వ్యాక్సిన్​ వేయరని భారత ప్రభుత్వ వ్యాక్సిన్​టాస్క్​ ఫోర్స్​ చైర్మన్​ డాక్టర్​ ఎన్​.కె.అరోరా ఇటీవల స్పష్టం చేశారు.  కొవిన్​ పోర్టల్​లో నాలుగో వ్యాక్సిన్​ డోసు బుకింగ్​ ను సపోర్ట్​ చేసేలా సెట్టింగ్స్​ లేవని.. ఒకవేళ నాలుగో డోసును బుక్​ చేసుకునే ప్రయత్నం చేసినా ఆటోమెటిక్​ గా రెజెక్ట్​ అవుతుందన్నారు. కాగా, 18 ఏళ్లకు పైబడిన వారంతా నాసల్​ వ్యాక్సిన్​ను వేయించుకోవచ్చు.