యార్కర్ల కింగ్ వస్తున్నాడు: సంతోషంలో సన్ రైజర్స్ అభిమానులు

యార్కర్ల కింగ్ వస్తున్నాడు: సంతోషంలో సన్ రైజర్స్ అభిమానులు

ఐపీఎల్ లో తన పదునైన యార్కర్లతో అందరి దృష్టిని ఆకర్షించాడు పేస్ బౌలర్ నటరాజన్. ఈ యార్కర్ల వీరుడు తమిళనాడు రాష్ట్రం అయినప్పటికీ తెలుగులో ఎక్కువగా అభిమానులను సంపాదించుకున్నాడు. దానికి కారణం ఐపీఎల్ లో మన తెలుగు జట్టయినా సన్ రైజర్స్ జట్టు తరపున ఆడటమే. డెత్ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తూ సన్ రైజర్స్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు  దేశవాలి క్రికెట్ లో సైతం అదరగొట్టి ఏకంగా టీమిండియాలో స్థానం సంపాదించాడు.

కెరీర్ అంతా బాగానే ఉన్నప్పుడు 2021 లో ఆస్ట్రేలియా టూర్ లో ఈ పేస్ బౌలర్ కు మోకాలి గాయం కావడంతో అంచనాలకు మించి రాణించలేకపోయాడు. దీంతో నటరాజన్ గురించి అందరూ మాట్లాడుకోవడం మానేశారు.అయితే ప్రస్తుతం ఈ 32 ఏళ్ళ బౌలర్ మునుపటి ఫామ్ అందుకున్నట్లుగానే కనిపిస్తున్నాడు. నిన్న (డిసెంబర్ 13) జరిగిన విజయ హజారే ట్రోఫీ సెమీ ఫైనల్లో 3 వికెట్లు తీసి సత్తా చాటాడు. పటిష్టమైన హర్యానా బ్యాటర్లను ఈ ఫాస్ట్ బాగా నిలువరించాడు. ఈ ప్రదర్శనతో సన్ రైజర్స్ అభిమానాలు పండగ చేసుకుంటున్నారు. 

2023 ఐపీఎల్ లో 12 మ్యాచ్ ల్లో 10 వికెట్లు మాత్రమే తీసి నిరాశపరిచాడు. హైదరాబాద్ ఓటమికి ఒకరకంగా నటరాజన్ చెత్త బౌలింగ్ కారణం. కానీ ప్రస్తుతం నటరాజన్ పూర్తి ఫిట్ నెస్ సాధించి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. మార్కో జాన్సన్, భువనేశ్వర్ లతో పదునైన బౌలింగ్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అటు భువీ, జాన్సెన్ టాప్ ఫామ్ లో ఉండగా వీరికి నటరాజన్ కలిస్తే సన్ రైజర్స్ కు తిరుగుండదు. 

2020 ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో భార‌త్ జ‌ట్టు న‌ట‌రాజ‌న్‌ను మూడు ఫార్మాట్ల‌లోనూ ఆడించింది. అంత‌కుముందు దేశ‌వాళీ టోర్నీల‌లో న‌ట‌రాజ‌న్ అద్భుతంగా రాణించ‌డంతో జాతీయ జ‌ట్టులో చోటు సంపాదించాడు. ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై అద్భుతంగా రాణించాడు. తొలుత వ‌న్డే మ్యాచ్‌లో, ఆ త‌ర్వాత టీ20 మ్యాచ్‌లో, అనంత‌రం టెస్టు మ్యాచ్‌లో న‌ట‌రాజ‌న్ టీమిండియా త‌ర‌ఫున క్యాప్ అందుకున్నాడు.