
న్యూఢిల్లీ: తమ కెనడా అనుబంధ సంస్థ యూఎస్-ఆధారిత బయోటెక్నాలజీ సంస్థ ఈజెనిసిస్లో 8 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 70 కోట్లు) పెట్టుబడి పెట్టిందని హైదరాబాద్‌కు చెందిన నాట్కో ఫార్మా తెలిపింది. ఈజెనిసిస్.. జినోట్రాన్స్‌ప్లాంటేషన్ సంస్థ. సురక్షితమైన, సమర్థవంతమైన మానవ- అవయవాలను అభివృద్ధి చేయడంపై ఇది దృష్టి సారించిందని కంపెనీ ఒక ఫైలింగ్‌లో తెలిపింది. జీనోట్రాన్స్‌ప్లాంటేషన్ సాంకేతికత వల్ల అవయవాల కొరత తగ్గుతుందని నాట్కో ఫార్మా వైస్ చైర్మన్ రాజీవ్ నన్నపనేని అన్నారు.
మానవేతర కణాలు, కణజాలాలు లేదా అవయవాలను మానవ వైద్య పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగించడాన్ని జెనోట్రాన్స్ ప్లాంటేషన్ అంటారు.