చరిత్ర సృష్టించిన నాథన్ లియోన్.. డబ్ల్యూటీసీలో తొలి బౌలర్ గా

చరిత్ర సృష్టించిన  నాథన్ లియోన్..  డబ్ల్యూటీసీలో తొలి బౌలర్ గా

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ చరిత్రలో  ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్  చరిత్ర సృష్టించాడు.  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలోనే అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్న తొలి బౌలర్‌గా నాథన్‌ నిలిచాడు. ఇప్పటివరకు లియోన్..  10 సార్లు 5 వికెట్ల హాల్‌ సాధించాడు.  దీంతో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రికార్డు బ్రేక్ అయింది.   అశ్విన్ 9 సార్లు ఈ ఫీట్ సాధించగా తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ లో  లియోన్ దీనిని  బ్రేక్ చేశాడు.  

ఇక మ్యాచ్ విషయానికి వస్తే..  వెల్లింగ్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 172 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. స్పిన్నర్ నాథన్ లియాన్ రెండో ఇన్నింగ్స్ లో  65 పరుగులకు ఆరు వికెట్లు.. మొత్తంగా మ్యాచ్ లో పది వికెట్లు తీసి జట్టు విజయంలో కీ రోల్ పోషించాడు.  తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ, రెండో ఇన్ని్ంగ్స్ లో ఒక వికెట్ తీసిన  ఆల్-రౌండర్ కామెరాన్ గ్రీన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కి్ంది.  

అంతకుముందు 13/2 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో ఆట కొనసాగించిన ఆసీస్‌‌‌‌ రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 51.1 ఓవర్లలో 164 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. నేథన్‌‌‌‌ లైయన్‌‌‌‌ (41) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. కామెరూన్‌‌‌‌ గ్రీన్‌‌‌‌ (34),   హెడ్‌‌‌‌ (29) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. గ్లెన్‌‌‌‌ ఫిలిప్స్‌‌‌‌5, హెన్రీ 3 వికెట్లు తీశారు.