రాజకీయాల కంటే దేశమే ముఖ్యం.. మోదీ పిలుపునకు మద్దతుగా కమల్ హాసన్ ఎమోషనల్ అప్పీల్!

రాజకీయాల కంటే దేశమే ముఖ్యం.. మోదీ పిలుపునకు మద్దతుగా కమల్ హాసన్ ఎమోషనల్ అప్పీల్!

పశ్చిమాసియా (Middle East) చిచ్చు ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ముఖ్యంగా యూఎస్-ఇజ్రాయెల్ కూటమి వర్సెస్ ఇరాన్ మధ్య నడుస్తున్న భీకర యుద్ధ వాతావరణం అంతర్జాతీయంగా పెను మార్పులకు దారితీస్తోంది. ఈ క్రమంలోనే లోకనాయకుడు, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఒక వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా తెగ వైరల్ అవుతోంది. రాజకీయాలకు అతీతంగా, దేశ ప్రయోజనాల కోసం ఆయన చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి.

ఎమోషనల్ అప్పీల్..

అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా చమురు ధరలు మండిపోతున్నాయి. సముద్ర వాణిజ్య మార్గాలు మూసుకుపోతున్నాయి. మన ఇళ్లు, పరిశ్రమలు, పంట పొలాలకు అవసరమైన ఇంధనం మరింత ప్రియం కానుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా దేశాలు విద్యుత్, ఇంధన పొదుపు నిబంధనలను కఠినతరం చేశాయి. సింగపూర్ ప్రధాని సైతం రాబోయే కష్టకాలానికి సిద్ధంగా ఉండాలని వారి ప్రజలను కోరారు. మరి మనలాంటి భారీ జనాభా ఉన్న దేశం ఎంత అప్రమత్తంగా ఉండాలి? అంటూ కమల్ ఆందోళన వ్యక్తం చేశారు.

గత త్యాగాలను గుర్తు చేస్తూ..

ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపును సమర్థిస్తూ.. గతంలో భారతీయులు చేసిన త్యాగాలను కమల్ గుర్తుచేశారు. 1962 చైనా యుద్ధ సమయంలో మన ఆడబిడ్డలు తమ ఒంటిమీద బంగారాన్ని సైనికుల కోసం దానం చేశారు. 1965లో దేశంలో తీవ్ర ఆహార కొరత ఏర్పడినప్పుడు, అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పిలుపు మేరకు భారతీయులంతా వారానికి ఒక పూట భోజనం మానేశారు. ఆనాటి త్యాగాలతో పోలిస్తే.. నేడు ప్రధాని మోదీ కోరుతున్న 'ఇంధన పొదుపు' చాలా చిన్న విషయం అని పేర్కొన్నారు.  

మన దేశ భవిష్యత్తు కోసం, పేదవాడిని ద్రవ్యోల్బణం నుండి రక్షించడం కోసం ప్రతి ఒక్కరూ ఒక యూనిట్ విద్యుత్, ఒక చుక్క చమురునైనా ఆదా చేయాలి అని పిలుపునిచ్చారు. 'ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి.. కానీ దేశం శాశ్వతం' అన్న వాజపేయి మాటలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ALSO READ : తెలంగాణలో 20 ఏళ్లు కాంగ్రెస్‎దే పవర్..

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kamal Haasan (@ikamalhaasan)

 

వరుస సినిమాలతో..
ఒకవైపు రాజకీయాల్లో, సామాజిక అంశాల్లో ఇంత యాక్టివ్‌గా ఉంటూనే, మరోవైపు కమల్ హాసన్ తన క్రేజీ సినిమా ప్రాజెక్టులతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. మణిరత్నం 'థగ్ లైఫ్' సినిమా తర్వాత.. ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఓ భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి కమల్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.. దశాబ్దాల తర్వాత వీరిద్దరి కాంబో సెట్ అవ్వడంతో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు.

దీనితో పాటు అన్బరివ్ దర్శకత్వంలో ఒక సినిమా, శివకార్తికేయన్‌తో 'సేయోన్' అనే చిత్రాన్ని కమల్ నిర్మిస్తున్నారు. మరో క్రేజీ అప్‌డేట్ ఏంటంటే.. సిబి చక్రవర్తి దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కే మరో ప్రతిష్టాత్మక చిత్రానికి కూడా కమల్ హాసనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ప్రభాస్ కల్కీ 2లో కూడా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు.  ఏదేమైనా, అటు వెండితెరపై టాప్ గేర్ లో దూసుకుపోతూనే.. ఇటు దేశం కోసం ఇంధనాన్ని పొదుపు చేయాలంటూ కమల్ హాసన్ ఇచ్చిన సందేశం నిజంగానే 'నెక్స్ట్ లెవెల్' అని ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.