Live Updates: వీర సైనికులకు దేశం ఘన నివాళి

Live Updates:  వీర సైనికులకు దేశం ఘన నివాళి

హెలికాప్టర్‌‌ ప్రమాదంలో అమరులైన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్‌లకు యావత్ దేశం కన్నీటి వీడ్కోలు పలికింది. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని బ్రార్‌‌ స్క్వేర్‌‌ శ్మశాన వాటికలో వారిద్దరి అంత్యక్రియలు సైనిక లాంఛనాల మధ్య శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ముగిశాయి. వారి కుమార్తెలు కృతిక, తరుణి ఇద్దరు కలిసి చితికి నిప్పుపెట్టి అంతిమ సంస్కారాలు చేశారు. ఈ సమయంలో సైనికులు 17 గన్ సెల్యూట్‌తో గౌరవ వందనం తెలిపారు.

 బిపిన్ రావత్ దంపతుల అంతిమయాత్ర ప్రారంభమైంది.  రావత్ కూతుర్లు నివాళులు అర్పించిన తర్వాత.. రావత్ దంపతుల పార్థీవ దేహాలను వాహనంపైకి ఎక్కించారు. ఢిల్లీ అంతటా రావత్  ఫోటోలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు జనం. ఢిల్లీ కామరాజ్ మార్గ్ లోని రావత్ ఇంటి నుంచి అంతిమయాత్ర మొదలైంది. భ‌రత భూమి పుత్రుడు రావ‌త్ అమ‌ర్ ర‌హే అంటూ నినాదాలు హోరెత్తాయి. బిపిన్ రావ‌త్ అమ‌ర్ ర‌హే.. సూర్యచంద్రులు ఉన్నంత కాలం.. బిపిన్ పేరు నిలిచిపోతదంటూ దేశ వీరుడికి జ‌నం వంద‌నాలు ప‌లికారు. సైనిక లాంఛనాలతో రావత్ దంపతుల అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వారి అంత్యక్రియల ఏర్పాట్లను  గోర్ఖా రైఫిల్స్ రెజిమెంట్‌ పూర్తి చేసింది. ఇదే రెజిమెంట్‌లో తొలుత చేరిన ఆర్మీలో చేరిన బిపిన్ ఆ తర్వాత దీనిని కమాండ్ స్థాయికి ఎదిగారు. అంత్యక్రియల్లో ఆయనకు 17 గన్‌ సెల్యూట్‌తో సైన్యం గౌరవ వందనం చేయనుంది.

 

‘నేను ఓ సైనికుడి భార్యను. ఇది నిజంగా తీర్చలేని లోటు.కానీ మనం వారికి ఓ మంచి ముగింపు ఇవ్వాలి.నవ్వుతూ వారిని సాగనంపాలి’. అని బ్రిజ్ ఎల్ఎస్ లిద్దర్ సతీమణి గీతిక లిద్దర్ అన్నారు.

‘మా నాన్న హీరో. నా బెస్ట్ ఫ్రెండ్. నా మోటివేటర్. నాకు ఇప్పుడు 17 ఏళ్లు. ఈ17 ఏళ్లు ఆయన నాతో ఉన్నారు. ఈ జ్ఞాపకాలతో మేం ముందుకు వెళ్తాం. ఇది భారత దేశానికి తీరని లోటు.’ అని బ్రిజ్ ఎల్ఎస్ లిద్దర్ కూతురు ఆషానా లిద్దర్ అన్నారు. 

బిపిన్ రావత్ దంపతులకు పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రావత్ దంపతుల భౌతికకాయానికి నివాళులర్పించారు. మధ్యాహ్నం రెండు గంటలకు రావత్ అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ సహా 14మంది అధికారులు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో రావత్ సతీమణి కూడా చనిపోయారు. 

బిపిన్ రావత్ కు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నివాళులర్పించారు. ఆయన భౌతికకాయం వద్ద పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.

తమిళనాడు కూనూర్ లో చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన బ్రిగేడియర్ ఎల్ఎస్ లిద్దర్ కు ఆయన కుటుంబీకులు నివాళి అర్పించారు. భార్య, కూతురు లిద్దర్ భౌతిక కాయాన్ని కడసారి చూసి కన్నీరుమున్నీరయ్యారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా లిద్దర్ కు నివాళి అర్పించారు. లిద్దర్ సేవలకు గానూ ఆయన సెల్యూట్ చేశారు. ఢిల్లీలోని మిలిటరీ బేస్ హాస్పిటల్లో ఉన్న లిద్దర్ భౌతికకాయాన్ని బ్రార్ స్క్వేర్ వద్ద క్రిమటోరియంకు  తరలించారు. ఆయనతో పాటు.. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తోపాటు ఇతర అధికారులు కూడా నివాళులు అర్పించారు. అనంతరం లిద్దర్ కుటుంబ సభ్యులతో రాజ్ నాథ్ మాట్లాడి వారిని ఓదార్చారు. తర్వాత లిద్దర్ యూనిఫామ్, జాతీయ పతాకాన్ని ఆయన భార్యకు అందజేశారు అధికారులు. కన్నీరు పెట్టుకుంటూనే వాటిని అందుకున్నారు. 

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ తో పాటు ఆమె సతీమణి మధులిక రావత్ కు ఘన నివాళుర్పించారు. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్. బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ ఆయన సతీమణి మరణించిన విషయం తెలిసిందే.

బిపిన్ రావత్ భౌతిక కాయం వద్ద డీఎంకే నేతలు రాజా, కనిమొళి నివాళులర్పించారు. 

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ దుర్ఘటనలో ప్రాణాలు వదిలిన వీర సైనికులకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. వాళ్లు చేసిన సేవల్ని దేశ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరన్నారు మోదీ. బిపిన్ రావత్ దంపతుల సహా మిగిలిన సైనికుల భౌతికకాయాల వద్ద నివాళులర్పించారు ప్రధాని. 

బ్రిగ్రేడియర్ లిద్దర్ కు అజిత్ దోవల్ నివాళి.