
హైదరాబాద్, వెలుగు: నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) ను రాష్ట్రంలో అత్యుత్తమ స్కిల్ డెవలప్ మెంట్ వేదికగా బలోపేతం చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి, న్యాక్ వైస్ చైర్మన్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో అన్నారు. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్ మెంట్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ విభాగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా శుక్రవారం జాతీయ ఉత్తమ టీచర్ అవార్డు అందుకున్న న్యాక్ ట్రైనర్ స్నేహలతకు మంత్రి ఫోన్ చేసి అభినందించారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు ఇప్పటికే తమ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నదన్నారు.