NC22 నుంచి లేటెస్ట్ అప్డేట్

NC22 నుంచి లేటెస్ట్ అప్డేట్

టాలీవుడ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో సినిమా చేస్తున్నాడు. NC 22 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్‌ గా నటిస్తోంది. గత కొద్దిరోజులుగా ఈ చిత్రం నుండి మేకర్స్ వరుసగా అప్ డేట్స్ ఇస్తున్నారు. తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ న‌టి ప్రియమణీ, వెర్సటైల్ యాక్టర్ సంపత్ రాజ్ కీలక పాత్రల్లో నటించబోతున్నట్లు ఇవాళ చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ప్రియమణి, సంపత్ రాజ్ పోస్టర్‌లను కూడా రిలీజ్‌ చేశారు.

ఇక ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ క‌ర్ణాట‌క‌లో జ‌రుగుతుంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి.. మాస్ట్రో ఇళయరాజాతో పాటు ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా కూడా సంగీతాన్ని సమకూరుస్తుండటం విశేషం. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.