తెలంగాణ టూరిజానికి జాతీయ అవార్డులు

తెలంగాణ టూరిజానికి జాతీయ అవార్డులు

తెలంగాణ టూరిజానికి జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయి. పర్యాటకులకు పర్యటన వివరాల కోసం రూపొందించిన ” ఐ ఎక్స్ ప్లోర్ తెలంగాణ ” అనే మొబైల్ యాప్ కు అవార్డ్ లభించగా..ఉత్తమ వైద్య పర్యాటక సౌకర్యం విభాగంలో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రికి మరో అవార్డ్ లభించింది.  ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో  ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి మాన్య శ్రీ. ప్రహ్లాద్ సింగ్ పటేల్ హాజరయ్యారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్.. కేసీఆర్ సీఎం అయిన తర్వాత తెలంగాణలోని టూరిజం ప్రాంతాలకు ప్రాముఖ్యతకు కల్పించారని అన్నారు.నాగార్జున సాగర్, శ్రీశైలం, మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా అనేక ప్రాంతాల్లో పర్యాటకుల సంఖ్య పెరుగుతుందన్నారు.గత ఐదు సంవత్సరాలుగా అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుందన్నారు.భవిష్యత్ లో పర్యాటక రంగంలో భారతదేశంలోనే అగ్రగామిగా తెలంగాణ ఉండబోతుందన్నారు.