పని ఒత్తిడితో బ్యాంక్ మేనేజర్ మృతి.. రాజీనామా చేసిన కొద్దిరోజులకే..

పని ఒత్తిడితో బ్యాంక్ మేనేజర్ మృతి.. రాజీనామా చేసిన కొద్దిరోజులకే..

పని భారంతో  ఆందోళన చెందుతున్న వారిని టెక్ రంగంలోనే కాకుండా ఇతర రంగాలలో కూడా చూస్తుంటాం... అయితే ఒకోసారి పని భారం లేక పని ఒత్తిడిని తట్టుకోలేక ప్రాణాలు వదులుకుంటుంటారు. మహారాష్ట్రలోని పూణే జిల్లా బారామతిలో ఓ ప్రముఖ బ్యాంకు సీనియర్ అధికారి ఆత్మహత్యకు గురైయ్యారు. అయితే పని ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు సంఘటన స్థలంలో దొరికిన లెటర్ ఆధారంగా  పోలీసులు తేల్చారు.

40 ఏళ్ల వయసున్న శివశంకర్ మిత్రా గురువారం రాత్రి బ్యాంకు ఆవరణలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, ఆరోగ్య సమస్యలు అలాగే పనిభారాన్ని పేర్కొంటూ జూలై 11న బ్యాంకు చీఫ్ మేనేజర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత నోటీసు వ్యవధిలో  కొనసాగిస్తున్నారని బారామతి పోలీస్ స్టేషన్ అధికారులు  తెలిపారు.

వివరాలు చూస్తే బ్యాంకింగ్ టైం అయిపోయిన  తర్వాత శివశంకర్  మిత్రా బ్రాంచ్‌కి తాళం తాను వేస్తానని  చెప్పి సిబ్బందినీ పంపించగా, వాచ్‌మన్ కూడా రాత్రి 9.30 గంటల సమయంలో వెళ్లిపోయాడు. శివశంకర్ మిత్రా గతంలో ఒక సహోద్యోగిని తాడు తీసుకురావాలని చెప్పాడు. దానితో రాత్రి 10 గంటల ప్రాంతంలో అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బ్యాంకు సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. 

ALSO READ : ఫ్రెండ్కు ఫుడ్లో మత్తుమందు కలిపి..13 తులాల బంగారం చోరీ

చీకటిపడుతున్న శివశంకర్  మిత్రా ఇంటికి రాకపోవడం,  కాల్స్‌ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో  అతని భార్య అర్ధరాత్రి సమయంలో బ్యాంకుకు వెళ్ళింది. లైట్లు ఆన్ చేసి ఉండటం  గమనించిన ఆమె లోపలి నుండి ఎటువంటి సౌండ్స్  రాకపోవడంతో ఆమె బ్యాంకు సిబ్బందికి సమాచారం అందించింది. చివరికి బ్యాంక్  ఓపెన్ చేసాక మిత్రా పైకప్పుకు వేలాడుతూ కనిపించాడు. సంఘటన స్థలం నుండి స్వాధీనం చేసుకున్న లేటరులో  తన ఆత్మహతకు పని ఒత్తిడి కారణమని పేర్కొన్నట్లు  పోలీసులు తెలిపారు. అతని ఆత్మహతకు ఎవరినీ బాధ్యులు కాదని, వైద్య చికిత్స కూడా తీసుకుంటున్నట్లు  తెలుస్తుందని, కేసు నమోదు చేసుకున్న పోలీసులు  దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.