దివ్యాంగ జవాన్లను ఫిట్ గా తయారు చేసి సైబర్ క్రైమ్ బాధ్యతలు

దివ్యాంగ జవాన్లను ఫిట్ గా తయారు చేసి సైబర్ క్రైమ్ బాధ్యతలు

-కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి

రంగారెడ్డి: యుద్ధ రంగంలో గాయపడి దివ్యాంగులుగా మారిన జవాన్లను శారీరకంగా… మానసికంగా మరింత దృఢంగా తయారు చేసి వారి సేవలను కొనసాగించేందుకు కట్టుబడి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. షామీర్ పేట్ లోని రంగారెడ్డి జిల్లా సీఆర్పీఎఫ్  హెడ్ క్వార్టర్స్ లో జాతీయ దివ్యంగుల సాధికారత కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి,  సీఆర్పీఎఫ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. యుద్ధ రంగంలో దివ్యాంగులుగా మారిన జవాన్లకు అండగా నిలిచేందుకు నేషనల్ సెంటర్ ఫర్ దివ్యాంగ ఎంపవర్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేశారు.

ఈ సెంటర్లో సీఆర్పీఎఫ్ దివ్యాంగ జవాన్లను ఫిజికల్ గా, మెంటల్ గా ఫిట్ గా తయారు చేయడమే ఈ సెంటర్ ప్రధాన ఉద్దేశ్యం. సైబర్ క్రైమ్ నేరాలను ట్రేస్ చేసేందుకు దివ్యాంగ జవాన్లకు ఈ సెంటర్ లో ట్రైనింగ్ ఇస్తారు. జాతీయ దివ్యాంగ సాధికారత కేంద్రంలో ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియం, మెడిటేషన్ సెంటర్, ఐటీ సెంటర్, హెల్త్ సెంటర్, పారా స్పోర్ట్స్ హాల్ లను పరిశీలించిన సందర్భంగా పలువురు దివ్యాంగ జవాన్లతో కిషన్ రెడ్డి స్వయంగా మాట్లాడారు.

దివ్యాంగ జవాన్లను సైబర్ వారియర్స్ గా మారుస్తున్నాం – ప్రకాష్ పరమేశ్వరి, CRPF డీజీ

దేశంలో జరిగిన వివిధ ఘటనల్లో చాలా మంది జవాన్లు అమరులయ్యారు.. ఇంకా కొంత మంది జవాన్లు తమ కాళ్ళు, చేతులు పోగొట్టుకున్నారు.. ఇలాంటి వారిని శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా మరింత దృఢవంతులుగా తయారు చేసి సైబర్ వారియలర్స్ గా మారుస్తామని సీఆరపీఎఫ్ డీజీ ప్రకాష్ పరమేశ్వరి చెప్పారు. సెంటర్ ను ప్రారంభించిన సందర్బంగా వివరాలను వెల్లడించారు. దేశ అంతర్గత భద్రత లో సైబర్ వార్ కూడా ప్రధానమైనది.. అలాంటి సైబర్ వార్ ని ఎదుర్కోవడానికి దివ్యాంగ జవాన్లను సైబర్ వారియర్స్ గా మారుస్తున్నాం.. స్పోర్ట్స్ లో రాణించిన దివ్యాంగ జవాన్లను పారా స్పోర్ట్స్ లో ట్రైనింగ్ ఇస్తున్నాం..  సుమారు 500 కి పైగా సీఆర్పీఎఫ్ జవాన్ల పిల్లలు కూడా దివ్యాంగులుగా ఉన్నారు… వారందరికీ ఈ సెంటర్ తోడ్పాటు అందిస్తుందన్నారు.