హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్-లో హై రిస్క్ ప్రెగ్నెన్సీపై నేషనల్ కాన్ఫరెన్స్

హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్-లో హై రిస్క్ ప్రెగ్నెన్సీపై నేషనల్ కాన్ఫరెన్స్

హైదరాబాద్, వెలుగు: హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్ లో గైనకాలజీ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో హైరిస్క్ ప్రెగ్నెన్సీపై  నేషనల్ కాన్ఫరెన్స్, లైవ్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి  500 మందికిపైగా గైనకాలజిస్టులు, సర్జన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయస్థాయి గైనకాలజీ నిపుణులతో ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించారు. ఇందులో గైనకాలజీలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వైద్య విధానాలను చర్చించారు.

అనంతరం యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి, యశోద హాస్పిటల్స్- సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్. కృష్ణవేణి నాయిని మాట్లాడారు. ఈ నేషనల్ కాన్ఫరెన్స్, లైవ్ వర్క్ షాప్ లో హైరిస్క్ ప్రెగ్నెన్సీపై క్లిష్టమైన అంశాలపై లోతైన చర్చ జరిగిందన్నారు. ప్రసూతి సమయంలో అత్యంత క్లిష్టమైన గర్భధారణలో కూడా తల్లీబిడ్డలను క్షేమంగా కాపాడటం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని చెప్పారు.