వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ వరంగల్) కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ సంస్థ నుంచి కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా బీసీఏ డిగ్రీని కలిగి ఉండాలి. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) పూర్తిచేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి: ఎలాంటి నిర్దిష్ట వయోపరిమితి పేర్కొనలేదు.
అప్లికేషన్: ఆఫ్‌లైన్ ద్వారా. ఈ మెయిల్ ద్వారా సాఫ్ట్ కాపీని పంపించాలి.
లాస్ట్ డేట్: నవంబర్ 31.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు nitw.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించండి.
