సీతక్క పై ఆరోపణలు చేస్తే ఊరుకోం : నాసిరెడ్డి సాంబశివరెడ్డి

సీతక్క పై  ఆరోపణలు చేస్తే ఊరుకోం : నాసిరెడ్డి సాంబశివరెడ్డి

మంగపేట, వెలుగు: మంత్రి సీతక్క పై    ఆరోపణలు చేస్తే  ఊరుకోబోమని జాతీయ మిర్చి టాస్క్ పోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక విలేకరులతో మాట్లడుతూ...  ఎక్కడో జరిగిన ఇసుక లారీల వ్యవహారాన్ని మంత్రి సీతక్కకి ఆపాదించడం బీఆర్ఎస్ నాయకుల చిల్లర రాజకీయాలకు నిదర్శనం అన్నారు.   

మాఫియాలు, దందాలు, వైన్స్,  మైన్స్ అన్ని కుంభకోణాలు గత ప్రభుత్వంలోనే జరిగాయన్నారు.   సీతక్క రాజకీయ జీవితం ఒక తెరిచిన పుస్తకమని,  మచ్చలేని రాజకీయ నేత అని అన్నారు .  ప్రతిపక్షాల చిల్లర రాజకీయాలు మానుకోవాలని చెప్పారు.