ఫిబ్రవరి 26 నుంచి ఓయూలో నేషనల్ సెమినార్

ఫిబ్రవరి 26 నుంచి ఓయూలో నేషనల్ సెమినార్

ఓయూ,వెలుగు:  ఉస్మానియా యూనివర్సిటీ  సోషియాలజీ  డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో  ‘ తెలంగాణ  పునర్నిర్మాణం–  అభివృద్ధి – దృక్పథాలు’ అంశంపై ఈ నెల 26 నుంచి 28 వరకు మూడు రోజులు జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు నేషనల్ సెమినార్ డైరెక్టర్ ప్రొఫెసర్  సి. గణేష్ తెలిపారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీలో సదస్సు ప్రారంభం అవుతుందని చెప్పారు.  ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరై ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

ఇందులో పలువురు ప్రముఖులు  అకాడమీషియన్స్,  స్వచ్ఛంద సంస్థల   నిర్వాహకులు,  బ్యూరోక్రాట్స్,  పత్రికా సంపాదకులు పాల్గొని  వివిధ అంశాలపై  ప్రసంగిస్తారని వివరించారు. ఈ సదస్సులో చర్చలు కూడా ఉంటాయన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి  ప్రొఫెసర్లు,  రీసెర్చ్ స్కాలర్స్ తమ పరిశోధనా పత్రాలను సమర్పిస్తారని చెప్పారు.