
హైదరాబాద్, వెలుగు: మరో నేషనల్ ఈవెంట్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుంది. నేషనల్ సబ్ జూనియర్ రోయింగ్ చాంపియన్‌షిప్ ఈనెల 27 నుంచి హైదరాబాద్‌లో జరగనుంది. 31వ తేదీ వరకు హుస్సేన్ సాగర్ లేక్‌లో అండర్- 13, అండర్- 15 కేటగిరీల్లో జరిగే ఈ మెగా టోర్నీలో 23 రాష్ట్రాల నుంచి దాదాపు 350 మంది రోయర్లు పాల్గొంటారు. ఈ టోర్నీకి సంబంధించిన పోస్టర్‌ను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్జ్) చైర్మన్ శివసేనారెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతో ఏడాది కాలంగా రాష్ట్రంలోని అన్ని క్రీడా మైదానాలు క్రీడాకారులతో కళకళలాడుతున్నాయని ఆయన అన్నారు.
హైదరాబాద్ నగరం మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ఈవెంట్లకు వేదిక కాబోతోందని చెప్పారు. నాలుగేండ్ల తర్వాత నేషనల్ సబ్ జూనియర్ రోయింగ్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తోందని, ఈ టోర్నీని సక్సెస్ చేసేందుకు స్పోర్ట్స్ అథారిటీ తరఫున సంపూర్ణ సహకారం అందజేస్తామని శాట్జ్ వీసీ, ఎండీ సోనీ బాలాదేవి తెలిపారు. రోయింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ రోయింగ్ అసోసియేషన్ ఈ టోర్నీ విజయవంతానికి కృషి చేస్తున్నాయని రోయింగ్ కోచ్ ఇస్మాయిల్ బేగ్ చెప్పాడు. ఆసియా రోయింగ్ చాంపియన్‌షిప్ ట్రైనింగ్ క్యాంప్‌నకు కూడా హైదరాబాద్ వేదిక కాబోతుందని
తెలిపాడు.