నీట్ యూజీ అప్లికేషన్లకు రేపటి వరకూ చాన్స్

నీట్ యూజీ అప్లికేషన్లకు రేపటి వరకూ చాన్స్

హైదరాబాద్, వెలుగు : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) యూజీ అప్లికేషన్లకు మరో చాన్స్ ఇస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకుని, అప్లికేషన్లు సబ్మిట్ చేయలేకపోయినవాళ్లు, కొత్తవాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చని తెలిపింది. neet.nta.nic.inలో అప్లికేషన్ విండోను మంగళవారం రీఓపెన్ చేశామని, ఇది గురువారం (ఈ నెల 13) ఉదయం 11.30 వరకు యాక్టివ్​గా ఉంటుందని తెలిపింది.

నీట్ యూజీ ఎగ్జాంకు అప్లికేషన్ల గడువు ఈ నెల 6తో ముగియగా, 8 నుంచి 10 వరకు కరెక్షన్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చినట్లు ఎన్టీఏ తెలిపింది. అనేక కారణాల వల్ల రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయలేకపోయా మని చాలా మంది విద్యార్థుల నుంచి విజ్ఞప్తులు వచ్చినందున అప్లై చేసుకునేందుకు ఈ మేరకు చివరి అవకాశం కల్పిస్తున్నట్లు వివరించింది.