NTPCలో ఉద్యోగాలు.. ఇంజినీరింగ్ చదివినోళ్లకు ఛాన్స్.. ఎలాంటి టెస్ట్ లేకుండా జాబ్..

NTPCలో ఉద్యోగాలు.. ఇంజినీరింగ్ చదివినోళ్లకు ఛాన్స్.. ఎలాంటి టెస్ట్ లేకుండా జాబ్..

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్  ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

మొత్తం పోస్టులు: 52. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ లేదా పూర్తికాల బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. కనీసం 65 శాతం తక్కువ కాకుండా మార్కులతో (ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 50 శాతం) ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్– 2025)కు హాజరై, చెల్లుబాటు అయ్యే గేట్–2025 స్కోరును కలిగి ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 30 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​ లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: మే 15.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. 

లాస్ట్ డేట్: మే 29.

సెలెక్షన్ ప్రాసెస్: గేట్–2025 స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్​లిస్ట్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్  careers.ntpc.co.in ను సందర్శించండి. 

►ALSO READ | విద్యార్థులకు గుడ్ న్యూస్: ఎయిర్ ఫోర్స్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. లాస్ట్ డేట్ జూన్ 19