భారత వైమానిక దళం గ్రూప్ ‘ఏ’ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్ సీఏటీ) 02/2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్ & నాన్-టెక్నికల్) విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
మొత్తం ఖాళీలు: 379 పోస్టులు.
విభాగాల వారీగా ఖాళీలు: ఏఎఫ్సీఏటీ ఎంట్రీ – ఫ్లయింగ్ బ్యాచ్ 35, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్) 211, గ్రౌండ్ డ్యూటీ (నాన్– టెక్నికల్) 107.
గేట్ స్కోర్ ఎంట్రీ: గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్) 29.
ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ (ఫ్లయింగ్): పర్మినెంట్ కమిషన్ కోసం సీడీఎస్ఈ ఖాళీల్లో 10 శాతం సీట్లు, షార్ట్ సర్వీస్ కమిషన్ కోసం ఏఎఫ్సీఏటీ ఖాళీల్లో 10 శాతం సీట్లు ఎన్సీసీ ఎయిర్ వింగ్ ‘సి’ సర్టిఫికేట్ హోల్డర్ల కోసం రిజర్వు చేస్తారు.
ఎలిజిబిలిటీ
ఫ్లయింగ్ బ్రాంచ్: ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ల్లో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. దాంతోపాటు ఏదైనా డిగ్రీ లేదా బీఈ/ బి.టెక్ పూర్తి చేసి ఉండాలి.
గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్): ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ల్లో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. సంబంధిత ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో బీఈ/ బి.టెక్ పూర్తి చేసి ఉండాలి.
గ్రౌండ్ డ్యూటీ (నాన్-టెక్నికల్)
అడ్మినిస్ట్రేషన్ & లాజిస్టిక్స్: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
అకౌంట్స్: కనీసం 60 శాతం మార్కులతో బి.కాం/ బీబీఏ (ఫైనాన్స్)/ బీఎంఎస్ (ఫైనాన్స్) లేదా సీఏ/ సీఎంఏ/ సీఎఫ్ఏ పూర్తిచేసి ఉండాలి.
మెటియోరాలజీ: సైన్స్ స్ట్రీమ్/ మ్యాథ్స్/ ఫిజిక్స్/ భూగోళశాస్త్రం మొదలైన వాటిలో కనీసం 50 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్లోఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి (2027, జులై 1 నాటికి)ఫ్లయింగ్ బ్రాంచ్: 20 నుంచి 24 సంవత్సరాలు (అభ్యర్థులు 2003, జులై 02 నుంచి 2007, జులై 01 మధ్య జన్మించి ఉండాలి). డీజీసీఏ కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉన్నవారికి 26 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది.
గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్ & నాన్-టెక్నికల్): 20 నుంచి 26 సంవత్సరాలు (అభ్యర్థులు 2001, జులై 02 నుంచి 2007, జులై 01 మధ్య జన్మించి ఉండాలి.
అప్లికేషన్ ప్రారంభం: మే 20.
అప్లికేషన్ ఫీజు: ఏఎఫ్సీఏటీ ఎంట్రీ అభ్యర్థులకు రూ. 550. ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ & గేట్ స్కోర్ ఎంట్రీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
లాస్ట్ డేట్: జూన్ 19.
హాల్ టికెట్/ అడ్మిట్ కార్డ్ విడుదల: ఆగస్టు 04.
ఆన్‌లైన్ పరీక్ష తేదీ: ఆగస్టు 08
సెలెక్షన్ ప్రాసెస్
రాత పరీక్ష: ఈ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో జరుగుతుంది. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. ఇందులో జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ & మిలిటరీ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి . మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కుల చొప్పున - 300 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. నెగిటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు.
ఎయిర్ ఫోర్స్ సెలెక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూ: రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటాయి.మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెరిట్ లిస్ట్ వెల్లడిస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ afcat.edcil.co.inను సందర్శించండి.
►ALSO READ | RCB అప్రెంటీస్ నోటిఫికేషన్ విడుదల: టెన్త్ పాసైన చాలు.. ఇంటర్వ్యూతో సెలెక్షన్..
