
- మూడు రోజుల పాటు కొనసాగిన పోటీలు
- హోరాహోరీగా తలపడిన అథ్లెట్లు
- పలు రికార్డులు బద్దలుకొట్టిన క్రీడాకారులు
హనుమకొండ, వెలుగు:హోరాహోరీగా సాగిన 5వ ఇండియన్ ఓపెన్ అండర్–23 అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్–2025 పోటీలు ముగిశాయి. హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో మూడు రోజులుగా ఈ పోటీలు జరగగా.. వివిధ క్రీడాంశాల్లో పలు రికార్డులు బ్రేక్ అయ్యాయి. చివరిరోజు శనివారం 21 ఈవెంట్లు నిర్వహించగా.. అందులో 18 ఫైనల్స్ ఉన్నాయి. ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాలు, డిపార్ట్మెంట్లకు చెందిన క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విజేతలను ప్రకటించి, మెడల్స్ అందజేశారు.
మెన్స్ విభాగంలో..
5 కి.మీ రన్ లో రామ్ హిషద్(ఉత్తర్ ప్రదేశ్), నిషాంత్ ఖారానా(హరియాణా), సందీప్ పాల్(యూపీ), జావెలిన్ త్రోలో ఆనంద్ సింగ్(రిలయన్స్), ఆదిత్య(జేఎస్ డబ్ల్యూ), పర్తీక్ కుమార్(హరియాణా), 400 మీ హర్డిల్స్ లో అర్జున్ ప్రదీప్(కేరళ), నటరాజ్ కల్యాణి(తమిళనాడు), హర్దీప్ కుమార్(పంజాబ్), ట్రిపుల్ జంప్ లో విశాల్ బహదూర్(ఝార్ఖండ్), ప్రదీప్ కుమార్(యూపీ), నర్పిందర్ సింగ్(పంజాబ్), 200 మీ. రన్ లో దొండపాటి హరుత్య(ఒడిశా), రాజబాబు(హరియాణా) ప్రతీక్(కర్నాటక), 800 మీ రన్ లో సోమ్ నాథ్ చౌహాన్(హరియాణా), ప్రథమేశ్(మహారాష్ట్ర), షకీల్(రాజస్థాన్), 3 కి.మీ స్టీపుల్ చేస్ లో రాహుల్(హరియాణా), నవరతన్(హరియాణా), రన్వీర్ సింగ్(గుజరాత్) గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించారు.
మహిళల విభాగంలో..
5 కి.మీ రన్నింగ్ లో సుప్రితీ(ఝార్ఖండ్), మిథాలి రాక్ భోయా(మహారాష్ట్ర), లతికా తల్వార్(రాజస్థాన్), హ్యామర్ త్రోలో స్నేహ(హరియాణా), ప్రతిభ(ఎంపీ), మిటల్ సోలంకి(గుజరాత్), లాంగ్ జంప్ లో ఖుషీ(బీఎస్ఎఫ్), నిషీ కుమారీ(బిహార్), ఇషా చందర్(ఉత్తరాఖండ్), జావెలిన్ త్రోలో కీర్తి ఇషార్వాల్(ఢిల్లీ), నిషి కుమారీ(బిహార్), ఇషా చందర్ ప్రాక్(ఉత్తరాఖండ్), ట్రిపుల్ జంప్ లో పూర్వ రాష్ సావన్(అంజూ బాబీ స్పోర్ట్స్), ప్రీతి(రాజస్తాన్), మేరిముక్త సోరెన్(ఒడిశా), 400 మీ. హర్డిల్స్‌లో హర్షిత(తమిళనాడు), మౌమీ జాన(ఎన్సీవోయి పటియాలా), రమణ్ దీప్ కౌర్(పంజాబ్), జావెలిన్ త్రోలో ఖుషీ యాదవ్(రాజస్థాన్), సలోని(హరియాణా), ప్రతీక్ష పటేల్(యూపీ), 200 మీ రన్ లో సుదేష్ణ హన్మాన్(మహారాష్ట్ర), ఆయూషీ(యూపీ), సమృతి జంవాల్(హిమాచల్), 800 మీ. రన్ లో లక్షిత(గుజరాత్), ప్రీతీ యాదవ్(మధ్యప్రదేశ్), ప్రతీక్ష యాదవ్(జేఎస్ డబ్ల్యూ), 800 హెప్టాథ్లాన్ కేతావత్ సింధు(తెలంగాణ), ఇషా చందర్ ప్రాక్(ఉత్తరాఖండ్), మగుదీశ్వరీ(తమిళనాడు), 3 కి.మీ స్టీపుల్ చేస్ ప్రాచీ దేవ్ కర్(మహారాష్ట్ర), సుస్మీతా(ఒడిశా), మంజూ చౌదరి(రాజస్థాన్) వరుసగా గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించారు.
సరికొత్త రికార్డులు..
మూడు రోజుల పాటు జరిగిన 5వ ఇండియన్ ఓపెన్ అండర్–23 అథ్లెటిక్స్ పోటీల్లో క్రీడాకారులు పలు రికార్డులు బ్రేక్ చేశారు. మొదటి రోజు నిర్వహించిన ఉమెన్స్ 100 మీ విభాగంలో మహారాష్ట్రకు చెందిన సుదీష్ణ హన్మంత్ శివన్కర్ 11.63 సెకన్లలో పూర్తి చేసి రికార్డు నెలకొల్పారు. 100 మీ. రన్ విభాగంలో గుజరాత్ కు చెందిన 11.62 సెకన్లలో పూర్తి చేసి రికార్డు బ్రేక్ చేశారు.
ఉమెన్స్ డిస్కస్ త్రోలో రాజస్థాన్ కు చెందిన నిఖితా కుమారి50.73 మీటర్లు విసిరి రికార్డు నెలకొల్పారు. 20కి.మీ రేస్ వాక్ ను ఉత్తరాఖండ్ కు చెందిన సచిన్ భోరా, లాంగ్ జంప్ లో కేరళకు చెందిన అనురాగ్ సీవీ, 400 మీటర్ల హర్డిల్స్ లో కేరళకు చెందిన అరుణ్ ప్రదీప్ రికార్డు నెలకొల్పారు.