తెలంగాణ భవన్లో జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు

 తెలంగాణ భవన్లో జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు

హైదరాబాద్  :   రాష్ట్ర ప్రభుత్వ అధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ భవన్ లో జరిగిన వేడుకల్లో బీఆర్ఎస్  రాజ్యసభ ఎంపీ కె కేశవరావు  తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి జాతీయ జెండాను అవిష్కరించారు.  శాసన సభ అవరణంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలిలో గుత్తా సుఖేందర్ రెడ్డి  జాతీయ జెండాను అవిష్కరించారు. 

సెప్టెంబర్‌ 17న రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థకు తెలంగాణ పరిణామం చెందిన సందర్భంగా ప్రతిఏటా ఆ రోజున తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ALSO READ:  దిమ్మదుర్తిలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం


మరోవైపు పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.  ఈ వేడుకల్లో కేంద్రమంత్రి అమిత్ షా పాల్గొని జాతీయ జెండాను అవిష్కిరించారు. సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు.   ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కు నివాళులు అర్పించారు అమిత్ షా.