ఆస్కార్ రాజమౌళిని సన్మానించేది ఇలాగేనా : నట్టికుమార్

ఆస్కార్ రాజమౌళిని సన్మానించేది ఇలాగేనా : నట్టికుమార్

తెలంగాణలో చిన్న సినిమాలకు ఏమి చేయట్లేదని, పెద్ద సినిమాలకు మాత్రమే గుర్తింపు వస్తుందని  ప్రముఖ నిర్మాత నట్టికుమార్ అన్నారు.  చిన్న సినిమాలకు ఐదవ షో కావాలని అడుగుతున్నాం కానీ ఇప్పటికి దీనిపై ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. తెలంగాణలొనే ఎక్కువ లాభాలు వస్తున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంటున్నారు కానీ తెలంగాణలో 32% , ఏపీ లో 68% వస్తుందని తెలిపారు. కానీ చాలా కంపెనీలు జీఎస్టీని తెలంగాణలోనే కడుతున్నాయని చెప్పారు.  సినీ ఇండస్ట్రీలో ఏపీ, తెలంగాణ అంటూ ఎలాంటి విభేదాలు లేవని,  అందరం కలిసే ఉన్నామని  నట్టికుమార్  స్పష్టం చేశారు.  

ఆస్కార్ అవార్డ్ మన తెలుగు సినిమాకి రావడం అందరూ గర్వించదగ్గ విషయమని నట్టికుమార్ తెలిపారు.  కానీ అవార్డ్ సాధించిన వాళ్ళకి సరైన గౌరవం దక్కలేదని అవేదన వ్యక్తం చేశారు. అవార్డ్ ఈవెంట్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పెద్దలు రాలేదని,  కేవలం సినిమాటోగ్రఫీ మంత్రి మాత్రమే వచ్చారని చెప్పారు. Fdc ఛైర్మెన్, టూరిజం మినిష్టర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు.  ఆస్కార్ అవార్డ్ సాధించిన వాళ్ళని ఇంత అర్జెంట్ గా ఎవరికి తెలీకుండా ఎందుకు సన్మానించారని నట్టికుమార్ ప్రశ్నించారు.  

తెలంగాణ, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాలతో ఎందుకు సంప్రదించలేదని అడిగారు. సన్మానించాలి కానీ ఇది సరైన పెద్దది కాదని నట్టికుమార్ అన్నారు.  ఈ ఈవెంట్ గురించి  అసలు చాలా మందికి ఇన్ఫర్మేషన్ కూడా లేదని చెప్పారు.  త్రిబుల్ ఆర్ మూవీ నిర్మాత దానయ్య లేకుండా ఈ ఈవెంట్ జరగడం సిగ్గుచేటన్నారు నట్టికుమార్.