Nani, Naresh: సినిమాలకి బ్రేక్ ఇవ్వమని చెప్పాను.. నరేష్పై నాని ఇంటరెస్టింగ్ కామెంట్స్

Nani, Naresh: సినిమాలకి బ్రేక్ ఇవ్వమని చెప్పాను.. నరేష్పై నాని ఇంటరెస్టింగ్ కామెంట్స్

అల్లరి నరేష్(Allari Naresh) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఆ ఒక్కటి అడక్కు(Aa Okkati Adakku). జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా(Faria Abdullah) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను  కొత్త దర్శకుడు మల్లి అంకం(Malli Ankam) తెరకెక్కిస్తుండగా.. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక(Rajeev chiluka) నిర్మిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిధిగా విచ్చేశారు. ట్రైలర్ రిలీజ్ అనంతరం నాని మాట్లాడుతూ.. ఆ ఒక్కటి అడక్కు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు రావడం చాలా సంతోషంగా ఉంది. నరేష్ సాధారణంగా ఇలాంటి వేడుకలకు రమ్మని అడగరు. అడిగారంటేనే ఈ సినిమా తనకు ఎంత స్పెషలో అర్థమవుతోంది. నరేష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ మధ్య బ్యాక్ టూ బ్యాక్ కామెడీ సినిమాలు చేసినప్పుడు నేనే చెప్పాను కాస్త.. కామెడీ సినిమాలకు బ్రేక్ ఇవ్వమని. ఇప్పుడు ఈ ట్రైలర్ చూశాక అర్థమైంది నరేష్ కామెడీని ఎంత మిస్ అవుతున్నానని.

ట్రైలర్ చాలా ఫన్నీగా ఉంది. మే 3న అది ఆడియన్స్ ఫీలవుతారని నేను అనుకుంటున్నాను. అందరూ ఈ సినిమా చూసి హాయిగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.. అంటూ చెప్పుకొచ్చాడు నాని. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి చాలా గ్యాప్ తరువాత అల్లరి నరేష్ నుండి వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.