నావల్ డాక్‌యార్డ్ అప్రెంటీసెస్ స్కూల్, విశాఖపట్నం (Naval Dockyard) అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ జనవరి 02.
పోస్టుల సంఖ్య: 320. అప్రెంటీస్‌షిప్.
విభాగాలు: మెకానిక్ డీజిల్ 32, మెషినిస్ట్ 12, మెకానిక్ (సెంట్రల్ ఏసీ ప్లాంట్) 6, ఫౌండ్రీమ్యాన్ 3, ఫిట్టర్ 60, పైప్ ఫిట్టర్ 30, ఎలక్ట్రీషియన్ 35, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్ 5, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 17, వెల్డర్ (గ్యాస్, ఎలక్ట్రిక్) 20, షీట్ మెటల్ వర్కర్ 30, షిప్ రైట్ (వుడ్) 30, పెయింటర్ (జనరల్) 15, మెకానిక్ మెకాట్రానిక్స్ 10, కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 15.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన సంస్థ /బోర్డు నుంచి పదోతరగతితోపాటు ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. మార్కులు/ గ్రేడ్‌లు/ గ్రేడ్ పాయింట్లు/శాతం లేని పదో తరగతి, ఐటీఐ సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకోరు.
వయోపరిమితి: 14 నుంచి 18 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: జనవరి 02.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష/ఆన్‌లైన్ పరీక్ష, నైపుణ్య పరీక్ష/శారీరక పరీక్ష (వర్తిస్తే), డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు joinindiannavy.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
