ఏ లక్ష్యం లేని మధు కథ : నవీన్ చంద్ర

ఏ లక్ష్యం లేని మధు కథ   :  నవీన్ చంద్ర

‘ఒక వ్యక్తికి లేని బిల్డప్‌‌ని చుట్టూ ఉన్న వాళ్ళు ఇవ్వడం మనం గమనిస్తుంటాం. అదే నిజం అనుకుని.. ఆ భ్రమలోనే ఉండిపోయే పాత్రలు మనకు నిజ జీవితంలోనూ ఎదురవుతాయి. ‘మంత్ ఆఫ్ మధు’ చిత్రంలో మధు పాత్ర కూడా అలాగే ఉంటుంది’ అని చెప్పాడు నవీన్ చంద్ర. నవీన్, స్వాతి జంటగా శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో యశ్వంత్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 6న విడుదలవుతోంది.  

ఈ సందర్భంగా నవీన్ చంద్ర మాట్లాడుతూ ‘సహజత్వానికి దగ్గరగా ఉండే మధుసూధనరావు పాత్రలో కనిపిస్తా. చదువుకునే రోజుల్లో ఫ్రెండ్స్ అతన్ని హీరోలా చూస్తుంటారు. అయితే కాలం గడిచిన కొద్దీ ఎవరి జీవితాల్లోకి వారు వెళ్ళిపోతారు. మధు మాత్రం అదే స్టేట్ ఆఫ్ మైండ్‌‌లో ఉండిపోతాడు. మందు, సిగరెట్‌‌కి అలవాటు పడిపోతాడు. ఒకరి కింద ఉద్యోగం చేయడు. ఏ బాధ్యత, లక్ష్యం లేవు. డబ్బుపై ఆశ లేదు. 

స్వాతి పాత్రలోనూ పెయిన్ ఉంటుంది. ఎన్‌‌ఆర్‌‌‌‌ఐ మధుమతితో పరిచయం తర్వాత  మా ఇద్దరి జీవితాలు ఎలా మారాయనేది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం శంకర్ గారి డైరెక్షన్‌‌లో ‘గేమ్ చేంజర్‌‌‌‌’తో పాటు మరో ఎనిమిది సినిమాల్లో నటిస్తున్నా’ అని చెప్పాడు.