నవంబర్ 4న ‘తగ్గేదే లే’ రిలీజ్

నవంబర్ 4న ‘తగ్గేదే లే’ రిలీజ్

‘దండుపాళ్యం’ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో దర్శకుడిగా ఓ మార్క్ క్రియేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకున్న శ్రీనివాసరాజు.. నవీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చంద్ర హీరోగా ‘తగ్గేదే లే’ చిత్రం తీశారు. నవంబర్ 4న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘కొవిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేయాలనుకున్న సినిమా కనుక త్వరగా పూర్తవుతుందని మర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిస్టరీని ఎంచుకున్నా. లవ్, లస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెంజెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చుట్టూ అల్లుకున్న కథ. ఏ స్టోరీలోనైనా ఈ మూడింటికీ లింక్ ఉంటుంది. నవీన్ చంద్రకి బాగా నచ్చి వెంటనే ఓకే చెప్పాడు. ‘దండుపాళ్యం’ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఇందులో తీసుకోవాలనుకోలేదు. అయితే కొవిడ్ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చాలామంది ఆ సినిమా చూసి కాల్ చేయడంతో వాళ్లనెందుకు తీసుకోకూడదనిపించింది. అదే టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘పుష్ప’ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని రిలీజవకముందే చూశాను.

‘తగ్గేదే లే’ అనే పదం యాప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనిపించి టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఫిక్సయ్యాం. ఆ డైలాగ్ ఇంత వైరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతుందనుకోలేదు. శాండిల్​వుడ్​లో ఇప్పుడు భారీ విజయాలొస్తున్నాయి. కానీ‘దండుపాళ్యం’ ఫస్ట్ పార్ట్ అప్పట్లోనే 36 కోట్లు వసూలు చేసింది. అప్పటికవి ‘కేజీయఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ రేంజ్ కలెక్షన్స్. ఆ తర్వాత  వంద రోజులు ఆడిన సినిమా లేదక్కడ. ‘కేజీయఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ కావొచ్చు, ‘కాంతార’ కావొచ్చు.. కన్నడ చిత్రాల సక్సెస్​కి కారణం, మూలాల నుండి కథల్ని తీసుకోవడమే. అదే కథతో మరో భాషలో హీరోల్ని ఒప్పించడం కష్టం. కాపీ కథల్ని, టెంప్లేట్ స్టోరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ప్రేక్షకులు అంగీకరించట్లేదు. ఆర్గానిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రమే మెప్పిస్తున్నాయి’ అన్నారు.