ధరణి అప్లికేషన్లను పరిష్కరించాలి

ధరణి అప్లికేషన్లను పరిష్కరించాలి
  • జిల్లా కలెకర్లకు రెవెన్యూ ముఖ్య కార్యదర్శి ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ధరణి కింద పెండింగ్ లో  ఉన్న అప్లికేషన్లను త్వరగా పరిష్కరించాలని రెవెన్యూ ప్రిన్సిపల్​ సెక్రటరీ నవీన్​ మిట్టల్​ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. భూ సమస్యల పరిష్కారం కోసం ధరణిలో కొత్తగా ఐదు మాడ్యూల్స్​ను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లతో హైదరాబాద్  నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ధరణి పెండింగ్ దరఖాస్తులు, జీఓ58, 59, 76, 118 కింద భూ క్రమబద్దీకరణపై రివ్యూ చేశారు. మిట్టల్ మాట్లాడుతూ, జీఓ 58, 59, 76 కింద 1.89 లక్షల అప్లికేషన్లు వచ్చాయని, వాటి ప్రాసెస్​ మొదలుపెట్టి నెల రోజుల్లో పూర్తిచేయాలన్నారు. 

కంపెనీలకు మంజూరు చేసిన పట్టాదారు పాసు పుస్తకాల్లో తప్పులుంటే సవరించే అధికారాన్ని కలెక్టర్ లాగిన్​లో అందించామన్నారు. ఆధార్ సీడింగ్ సమయంలో పొరపాటు వల్ల ఒకరి భూమి మరొకరికి అనుసంధానమైందని, దీని నివారణకు తహసీల్దార్ లాగిన్​లో అవకాశమిచ్చామన్నారు.  జీఓ 118 కింద పెండింగ్ ఉన్న దరఖాస్తులు 15 రోజుల్లో పూర్తి చేయాలని అన్నారు.