ఒడిశా సీఎం ప్రైవేట్​ సెక్రటరీకి కేబినెట్ మంత్రి హోదా

ఒడిశా సీఎం ప్రైవేట్​ సెక్రటరీకి కేబినెట్ మంత్రి హోదా

భువనేశ్వర్: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రైవేట్​ సెక్రటరీ వీకే పాండియన్ కేబినెట్ మంత్రి హోదా పొందారు. అతడు 5టీ (ట్రాన్స్‌‌ఫార్మేషనల్ ఇనీషియేటివ్స్) చైర్మన్‌‌ గా నియమితులైనట్లు సాధారణ పరిపాలన, ప్రజా ఫిర్యాదుల విభాగం తెలిపింది. పాండియన్ ప్రభుత్వ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన తర్వాతి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది.

“పాండియన్.. నబిన్ ఒడిశా చైర్మన్​గా కేబినెట్ మంత్రి హోదాలో నియమితుల య్యారు. ఆయన నేరుగా సీఎం ఆధ్వర్యం లో పని చేస్తారు” అని గ్రీవెన్స్ డిపార్ట్‌‌మెంట్‌‌ ఉత్తర్వులు జారీ చేసింది. పాండియన్ రూపొందించిన ‘అమా ఒడిశా, నబిన్ ఒడిశా’ (మన ఒడిశా, కొత్త ఒడిశా) అనే రాష్ట్ర ప్రభుత్వ కొత్త స్కీమ్‌‌కు కూడా ఇన్‌‌చార్జ్‌‌గా ఉంటారని వెల్లడించింది. పాండియన్.. 2011లో సీఎంవోలో చేరారు. అప్పటి నుంచి ఆయన పట్నాయక్ ప్రైవేట్ సెక్రటరీగా కొనసాగుతున్నారు.