Anaganaga Oka Raju: బడా హీరోలకి పోటీగా.. సంక్రాంతి బరిలో నవీన్ పొలిశెట్టి.. స్పెషల్ ప్రోమోతో అంచనాలు

Anaganaga Oka Raju: బడా హీరోలకి పోటీగా.. సంక్రాంతి బరిలో నవీన్ పొలిశెట్టి.. స్పెషల్ ప్రోమోతో అంచనాలు

కామెడీ టైమింగ్ స్టార్ నవీన్ పొలిశెట్టి అప్ కమింగ్ రిలీజ్ మూవీ ‘అనగనగా ఒక రాజు’ (AOR). మరోసారి క్లీన్ కామెడీ ఎంటర్టైనర్తో ఆడియన్స్ని అలరించడానికి నవీన్ రెడీ అయ్యాడు. డైరెక్టర్ మారి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ సంక్రాంతి కానుకగా వస్తున్నట్లు మేకర్స్ లేటెస్ట్గా ప్రకటించారు. 

ఈ సందర్భంగా ఇవాళ (సెప్టెంబర్ 26న) స్పెషల్‌ ప్రోమో రిలీజ్ చేశారు. సరికొత్త కాన్సెప్ట్ తో డిజైన్ చేసిన ఈ ప్రోమో ఆసక్తి కలిగిస్తుంది. జ్యువెలరీ యాడ్‌లో నటిస్తున్నటుగా హీరోయిన్ మీనాక్షి ఇచ్చిన ఎంట్రీ ఆకట్టుకునేలా ఉంది.

అలాగే, వారి సరదా మాటలు, ఇచ్చిన క్యూట్ కామెడీ ఎక్సప్రెషన్స్ భలే ముచ్చటగా ఉన్నాయి. ఓవరాల్ గా.. ఈ స్పెషల్ జ్యువెల్లరీ యాడ్ ద్వారా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తీరు సినిమాపై క్యూరియాసిటీ పెంచేలా ఉంది. ఇప్పటికే విడుదలైన ప్రీ వెడ్డింగ్‌‌‌‌‌‌‌‌ వీడియోకు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.

మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌, ఫార్చ్యూన్‌ 4 సినిమాస్‌ బ్యానర్స్పై నాగవంశీ నిర్మాణంలో తెరకెక్కుతుంది. ఇకపోతే.. 2026 సంక్రాంతి బరిలో ప్రభాస్ నటించిన రాజా సాబ్తో పాటుగా చిరు-అనిల్ మూవీ, విజయ్ దళపతి జన నాయకుడు (2026 జనవరి 9), రవితేజ-కిషోర్ తిరుమల మూవీస్ ఉన్నాయి.

గతంలో చూసుకుంటే.. సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలకు పోటీగా చిన్న హీరోలు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. వాటిలో ఏ ఒక్కటి నిరాశ పరచలేదు. దానికితోడు భారీ విజయాలు కూడా నమోదు చేసుకున్నాయి. ఇక ఈసారి కామెడీ స్టార్ నవీన్ సక్సెస్ అందుకోవడం పక్కా అనే చెప్పాలి.

చిరు-అనిల్ మూవీ:

డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న  “మన శంకరవరప్రసాద్ గారు” సంక్రాంతి బరిలో నిలిచింది. ఇటీవలే టైటిల్ ఫిక్స్ చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. అనిల్ సిగ్నేచర్ స్టైల్‌కి, చిరు అల్టిమేట్ క్లాసికల్ స్వాగ్తో కుమ్మేశారు. 'పండుగకి వస్తున్నారు' అనే క్యాప్షన్తో 2026 సంక్రాంతికి అని తెలిపారు. కానీ, రిలీజ్ డేట్ ఎప్పుడనేది క్లారిటీ ఇవ్వలేదు. 

మారుతి- ప్రభాస్:

మారుతి తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఊరిస్తూ వస్తోంది. ప్రభాస్ కెరీర్లో ఫస్ట్ టైం హారర్ కామెడీ జానర్ సినిమా చేస్తుండటంతో సినిమా భారీ హైప్ ఉంది. కానీ, సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వస్తుండటంతో ఫ్యాన్స్ డిస్సప్పాయింట్ అవుతున్నారు. అయితే, ఇపుడీ రాజాసాబ్ మరింత దూరం వెళ్లినట్లు తెలుస్తోంది.  రాజా సాబ్ జనవరి 9న వస్తున్నట్లు ఇటీవలే నిర్మాత టీజీ విశ్వప్రసాద్ వెల్లడించారు.

రవితేజ-కిషోర్ తిరుమల:

మాస్ మహారాజ రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కిషోర్ తిరుమల డైరెక్షన్‌‌‌‌లో ఓ మూవీ చేస్తున్నాడు. ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌వీ  సినిమాస్ బ్యానర్‌‌‌‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అనార్కలి’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం వరుస షెడ్యూల్స్ తో షూటింగ్ జరుపుకుంటుంది. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. డేట్ పై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.