జూబ్లీహిల్స్, వెలుగు: ఫేక్ సర్వేలతో ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నించినా కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్పష్టం చేశారు.
ఆదివారం మైనంపల్లి హనుమంతరావుతో కలిసి ఎర్రగడ్డ, వెంగళరావు నగర్లో ఇంటింటి ప్రచారం చేశారు. మైనంపల్లి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే పేదల ప్రజల ప్రభుత్వమని, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
