పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రం కుట్ర చేస్తోంది :  నవజ్యోత్ సింగ్ సిద్ధూ  

పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రం కుట్ర చేస్తోంది :  నవజ్యోత్ సింగ్ సిద్ధూ  

మన దేశంలో నియంతృత్వం వచ్చినప్పుడల్లా ఒక విప్లవం కూడా వచ్చిందని... ఈసారి ఆ విప్లవం పేరు రాహుల్ గాంధీ అని కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ  అన్నారు. 34 ఏళ్ల నాటి కేసులో పాటియాలా జైలులోశిక్ష అనుభవించిన ఆయన సత్ర్పవర్తన కారణంగా రెండు నెలల ముందుగానే  జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు.

 ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యం అంటూ ఏమీ లేదన్న సిద్ధూ ...  పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన తీసుకురావడానికి కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. పంజాబ్‌లో సమస్యలను సృష్టించడానికి, శాంతిభద్రతలకు భంగం కలిగించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పంజాబ్‌ను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తే బలహీనంగా మారతారని హెచ్చరించారు. 

https://twitter.com/ANI/status/1642142497941110785