నవోదయ స్కూల్స్​లో టీచింగ్​ జాబ్స్​

నవోదయ స్కూల్స్​లో టీచింగ్​ జాబ్స్​

నవోదయ విద్యాలయ సమితి  (ఎన్‌‌‌‌‌‌‌‌వీఎస్‌‌‌‌‌‌‌‌) దేశవ్యాప్తంగా టీచర్​ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది. 1616 పోస్టులకు ఆన్​లైన్​లో జులై 27 వరకు అప్లై చేసుకోవాలి. 

పోస్టులు: ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌– 12, పీజీటీ (పోస్ట్‌‌‌‌‌‌‌‌ గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌ టీచర్లు)–397, టీజీటీ (ట్రెయిన్డ్‌‌‌‌‌‌‌‌ గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌ టీచర్లు)– 683,టీజీటీ (థర్డ్‌‌‌‌‌‌‌‌ లాంగ్వేజ్‌‌‌‌‌‌‌‌)– 343, మిసిలీనియస్‌‌‌‌‌‌‌‌ కేటగిరీ (ఆర్ట్‌‌‌‌‌‌‌‌, పీఈటీ, లైబ్రేరియన్‌‌‌‌‌‌‌‌)– 181.

ప్రిన్సిపల్: మొత్తం 12 పోస్టులు ఉన్నాయి. కనీసం 50 శాతం మార్కులతో మాస్టర్స్‌‌ డిగ్రీతో పాటు బీఈడీ ఉత్తీర్ణత సాధించాలి.  సంబంధిత పని అనుభవం ఉండాలి. వయసు 50 ఏళ్లు మించకూడదు. 

పీజీటీ:  ఇందులో మొత్తం 397 పోస్టులు ఉన్నాయి. కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఆర్‌‌సీఈ (ఎన్‌‌సీఈఆర్‌‌టీ) నుంచి రెండేళ్ల ఇంటిగ్రేటెడ్‌‌ పీజీ డిగ్రీతో పాటు బీఈడీ ఉత్తీర్ణత.   

టీజీటీ (థర్డ్‌‌ లాంగ్వేజ్‌‌): కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఆర్‌‌సీఈ (ఎన్‌‌సీఈఆర్‌‌టీ) నుంచి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌‌ డిగ్రీతో పాటు బీఈడీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సీటెట్‌‌ అర్హత సాధించి ఉండాలి. మొత్తం 343 ఖాళీలు ఉన్నాయి. 
సెలెక్షన్​ ప్రాసెస్​: కంప్యూటర్‌‌‌‌‌‌‌‌ బేస్డ్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌, పర్సనల్‌‌‌‌‌‌‌‌ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ ద్వారా జులై 27 వరకు దరఖాస్తు చేసుకోవాలి.
అప్లికేషన్​ ఫీజు: ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌ పోస్టులకు రూ.2000, పీజీటీ పోస్టులకు రూ.1800, టీజీటీ, మిస్‌‌‌‌‌‌‌‌లీనియస్‌‌‌‌‌‌‌‌ కేటగిరీ టీచర్‌‌‌‌‌‌‌‌ పోస్టులకు రూ.1500 చెల్లించాలి. పూర్తి సమాచారం కోసం www.navodaya.gov.in వెబ్​సైట్​ సంప్రదించాలి.