
- కేంద్రాన్ని ఒప్పించిన ఎంపీ రఘునందన్ రావు
రామచంద్రపురం, వెలుగు: కేంద్రం సంగారెడ్డి జిల్లాకు మంజూరు చేసిన జవహర్ నవోదయ విద్యాలయాన్ని అమీన్‌పూర్‌లో స్థాపించనున్నారు. శుక్రవారం ఎంపీ రఘునందన్ రావు నవోదయ స్కూల్డిప్యూటీ కమిషనర్ అభిజిత్ బేరని కలిసి అమీన్పూర్ లో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు వారం రోజుల్లో స్థలాన్ని పరిశీలించేందుకు అమీన్ పూర్ రానున్నారు.
ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ రూ.1,500 కోట్లతో నిర్మించే ఈ నవోదయ స్కూల్ కు ప్రతి ఏడాది రూ.500 కోట్ల చొప్పున మూడేళ్లు నిధులు వస్తాయన్నారు. భవన నిర్మాణం పూర్తయ్యేలోగా ప్రైవేట్ భవనాన్ని అద్దెకు తీసుకుని తాత్కాలిక వసతి కల్పించి వచ్చే విద్యా సంవత్సరంలో స్కూల్ప్రారంభం అయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
కన్వెన్షన్ హాల్ ప్రారంభించిన దత్తాత్రేయ
సంగారెడ్డి: గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి కన్వెన్షన్ హాల్స్అవసరమని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. శుక్రవారం కొండాపూర్ మండలం మల్లేపల్లి గ్రామ శివారులో బీజేపీ రాష్ట్ర నాయకుడు రాజేశ్వరరావు దేశ్పాండే ఏర్పాటు చేసిన ఆర్ ఆర్ ఆర్ కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, డాక్టర్ రాజు గౌడ్, మాజీ సీడీసీ చైర్మన్లు మాణిక్యం,బుచ్చిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయినాథ్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నరీన్ దేశ్పాండే, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ రాష్ట్ర నాయకులు ఈ కన్వెన్షన్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.