ఘనంగా ఏడుపాయల వనదుర్గామాత అమ్మవారి శోభాయాత్ర

ఘనంగా ఏడుపాయల వనదుర్గామాత అమ్మవారి శోభాయాత్ర

పాపన్నపేట, వెలుగు: ఏడుపాయల వనదుర్గామాత ఆలయం వద్ద నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. గోకుల్ షెడ్ లో ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని గురువారం పల్లకీలో ప్రతిష్ఠించి ఊరేగింపుగా తీసుకువచ్చారు. రాజగోపురం ముందు నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. దసరా పండగ సందర్భంగా రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పంచామృతాభిషేకం చేపట్టి రాజరాజేశ్వరీ దేవిగా అలంకరించారు. 

అమ్మవారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్​పర్సన్​సుహాసిని రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. 

దుర్గామాతను దర్శించుకున్న ఎంపీ  

మనోహరాబాద్:  మండల కేంద్రంలో పురోహితుడు రాము శర్మ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గామాతను ఎంపీ రఘునందన్ రావు శుక్రవారం దర్శించుకున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర సర్పంచ్ ల ఫోరం ఉపాధ్యక్షుడు నత్తి మల్లేశ్, మండల బీజేపీ అధ్యక్షుడు వెంకటేశ్, నాయకులు అజయ్, నాగరాజు, శ్రీకాంత్, బాలకృష్ణ పాల్గొన్నారు.