సవాళ్లను ఎదుర్కోవడానికి నేవీ రెడీ: రాజ్‌నాథ్

సవాళ్లను ఎదుర్కోవడానికి నేవీ రెడీ: రాజ్‌నాథ్

న్యూఢిల్లీ: ఏ సవాలునైనా ఎదుర్కోవడానికి ఇండియన్ నేవీ సంసిద్ధంగా ఉందని డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఈస్టర్న్ లడఖ్‌లో చైనాతో వివాదం నేపథ్యంలో యుద్ధనౌకలు, విమానాల విస్తరణ పనుల్లో నేవీ చురుగ్గా దూసుకెళ్తుండటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇండియన్ ఓషియన్ రీజియన్ (ఐవోఆర్‌‌)లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో నేవీ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

నార్తర్న్ బార్డర్‌‌లో ఎలాంటి చాలెంజెస్‌ ఎదురైనా ఎదుర్కోవడానికి యుద్ధ నౌకల్ని నేవీ రెడీ చేస్తోంది. అలాగే లడఖ్‌ సెక్టార్‌‌లో నిఘా కోసం ఎయిర్‌‌క్రాఫ్ట్స్‌ను సంసిద్ధం చేస్తోంది. నేవీ కమాండర్స్‌తో నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో రాజ్‌నాథ్ నావికా అధికారులను మెచ్చుకున్నారు. మాల్దీవులు, మారిషస్, సెచెల్లస్, మడగాస్కర్ లాంటి దేశాలకు వైద్య సదుపాయం అందించడంలో నేవీ చేసిన కృషిని రాజ్‌నాథ్ ప్రశంసించారు. ఇండియా ఆసక్తులను కాపాటంలో భాగంగా ఐవోఆర్‌‌లోని సున్నితమైన ప్రాంతాల్లో యుద్ధనౌకలు, విమానాల విస్తరణ పనులను నేవీ చేపడుతోందని పేర్కొన్నారు.