షిప్ మునక ఘటనలో..9 మందిని కాపాడిన నేవీ

షిప్ మునక ఘటనలో..9 మందిని కాపాడిన నేవీ
  • మరో ఐదుగురు ఇండియన్లు, 
  • ఇద్దరు శ్రీలంకన్ల కోసం గాలింపు కొనసాగిస్తున్న రెస్క్యూ టీం 

న్యూఢిల్లీ : ఒమన్ తీరానికి సమీపంలో ఆయిల్ ట్యాంకర్ షిప్ సముద్రంలో మునిగిపోయిన ఘటనలో 9 మంది సిబ్బందిని ఇండియన్ నేవీ రెస్క్యూ టీం బుధవారం కాపాడింది. నేవీ కాపాడిన సిబ్బందిలో 8 మంది ఇండియన్ లు, ఒకరు శ్రీలంకకు చెందిన వ్యక్తి ఉన్నారని నేవీ వెల్లడించింది. మిగతా సిబ్బంది కోసం రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నట్టు తెలిపింది.

కాగా, కొమొరాస్ దేశానికి చెందిన ఎంటీ ఫాల్కన్ ప్రెస్టీజ్ అనే ఆయిల్ ట్యాంకర్ షిప్ మంగళవారం ఒమన్ తీరంలో ప్రమాదానికి గురైంది. అందులో సిబ్బందిగా పని చేస్తున్న 13 మంది ఇండియన్లు, ముగ్గురు శ్రీలంక వాసులు చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు ఇండియన్ నేవీ పంపిన ఐఎన్ఎస్ తేగ్ వార్ షిప్ అక్కడికి చేరుకుని రెస్క్యూ చర్యల్లో పాల్గొంటోంది.