మాజీ ప్ర‌ధాని ష‌రీఫ్ ను అప్ప‌గించండి..లండ‌న్ వీధుల్లో ద‌ర్జాగా తిరుగుతున్నాడు

మాజీ ప్ర‌ధాని ష‌రీఫ్ ను అప్ప‌గించండి..లండ‌న్ వీధుల్లో ద‌ర్జాగా తిరుగుతున్నాడు

మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ ను త‌మ‌కు అప్ప‌గించాల‌ని పాక్ ప్ర‌భుత్వం బ్రిట‌న్ ను కోరింది. ట్రీట్మెంట్ కోసం బ్రిట‌న్ వెళ్లిన న‌వాజ్ ష‌రీఫ్ ను పాకిస్తాన్ కు అప్ప‌గించాల‌ని ఆ దేశ ప్ర‌స్తుత ప్ర‌ధాని ఇమ్రాన్ సలహాదారు షాజాద్ అక్బర్ తెలిపారు.

ట్రీట్మెంట్ కోసం బ్రిట‌న్ వెళ్లి ఇంకా స్వ‌దేశానికి రాలేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన షాజాద్..ష‌రీఫ్ రాలేదంటే ఆయ‌న సోద‌రుడు షాబాద్ ష‌రీఫ్ పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

ఆప‌రేష‌న్ కోసం బ్రిట‌న్ వెళ్లారు. ట్రీట్మెంట్ అయిపోయింది. లండ‌న్ లో ద‌ర్జాగా ఉన్నారు. నవాజ్ షరీఫ్ లండన్ వీధుల్లో నడవడం పాకిస్తాన్ ప్రభుత్వం, కోర్టు ఎదుట చెంపదెబ్బ అని అన్నారు. ఈ చర్య వ్యక్తిగత నిర్ణయం కాదని అన్నారు.