పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు తీవ్ర అస్వస్థత

పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు తీవ్ర అస్వస్థత

పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఆయన ప్లేట్‌లెట్లు ప్రమాదకరస్థాయికి పడిపోవడంతో ఫ్యామిలీ డాక్టర్ సూచనతో జైలు అధికారులు ఆయనను లాహోర్‌లోని నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో కార్యాలయం నుంచి… లాహోర్ సర్వీసెస్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రతిపక్ష నేత షెహబాజ్ షరీఫ్ ఆస్పత్రికి చేరుకుని నవాజ్‌ను పరామర్శించారు.

ఆస్పత్రి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. నవాజ్ చికిత్స పొందుతున్న గదిని తాత్కాలిక సబ్‌జైలుగా ప్రకటించిన అధికారులు ఆయన్ను ఎవరూ కలవకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పనామా పేపర్ల కుంభకోణం కేసులో నవాజ్ షరీఫ్ ప్రస్తుతం లాహోర్ కోర్టులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు.