చెల్లి కోరిక మేరకు రాఖీ రోజు పోలీసులకు లొంగిపోయిన నక్సల్ అన్న

చెల్లి కోరిక మేరకు రాఖీ రోజు పోలీసులకు లొంగిపోయిన నక్సల్ అన్న

తన చెల్లెలి కోరిక మేరకు ఓ నక్సలైట్ రాఖీ పండగ రోజు పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన ఛత్తీస్‌గర్ లో జరిగింది. దంతేవాడ జిల్లా పల్నార్ గ్రామానికి చెందిన మల్లా అనే యువకుడు.. 12 ఏళ్ల వయసున్నప్పుడు ఇంట్లోంచి పారిపోయి నక్సలైట్లలో చేరాడు. అతని వయసుతో పాటు.. అతని క్యాడర్ కూడా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు అతను భైరాంగర్ ఏరియా కమిటీకి కమాండర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

మల్లా నక్సలైట్లలో చేరిన 14 ఏళ్ల తర్వాత రాఖీ పండగ సందర్భంగా ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చిన ఆ అన్నకు రాఖీ కట్టిన చెల్లి లింగే.. రాఖీ సందర్భంగా ఓ కోరిక కోరింది. అదేంటంటే.. అన్నను తిరిగి నక్సలైట్లలో కలవవద్దని కోరింది. దాంతో చెల్లి కోరిక మేరకు ఆ అన్న పోలీసులకు లొంగిపోయాడు. మల్లా పై పోలీసులు రూ. 8 లక్షల రివార్డు ప్రకటించారంటే.. అతను ఎంత కీలక వ్యక్తి అయిఉంటాడో అర్థం చేసుకోవచ్చు.

ఇన్ని సంవత్సరాలు తన సోదరి లింగేను చూడటానికి మల్లా గ్రామానికి వచ్చాడు. రాఖీ కట్టిన లింగే.. పోలీసులకు లొంగిపోవాలని విజ్ఞప్తి చేసింది. దంతేవాడలో భద్రతా దళాల కాల్పుల్లో చాలామంది నక్సలైట్లు మరణించారు. దాంతో తన అన్నకు కూడా ప్రమాదముందని భావించిన లింగే భయపడింది. ప్రస్తుతం మల్లా 2016 నుంచి ప్లాటూన్ డిప్యూటీ కమాండర్ గా పనిచేస్తున్నాడు.

దంతేవాడ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) అభిషేక్ పల్లవ్ మాట్లాడుతూ.. ‘మల్లా భైరామ్‌గర్ ప్రాంతానికి చెందిన ప్లాటూన్ కమాండర్. ఆ ప్రాంతంలో గత దశాబ్దంలో జరిగిన ప్రధాన ఎన్ కౌంటర్లలో మల్లా కీలక వ్యక్తి. అతని వల్ల ఎంతోమంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. అతను దంతేవాడలో అమలులో ఉన్న లోన్ వర్రాటు పథకం కింద పోలీసులకు లొంగిపోయాడు. లొంగిపోయిన నక్సలైట్లకు పునరావాసం కల్పించడమే ఈ పథకం యొక్క లక్ష్యం. మల్లా ఈ రోజు ఉదయమే అరెస్టు చేయబడినందున అతని గురించి ఇంకా ఖచ్చితమైన వివరాలు తెలియవు’ అని ఎస్పీ తెలిపారు.

For More News..

ప‌టాన్‌చెరూ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

వీడియో: కేటీఆర్ కు రాఖీ కట్టిన సోదరి కవిత

ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ కు కరోన.. ఆయనతో మీటింగ్ లో పాల్గొన్న కేటీఆర్

శానిటైజర్ తాగి ముగ్గురు మృతి.. రహస్యంగా అంత్యక్రియలు చేసిన బంధువులు