
కోలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్ నయనతార-విఘ్నేశ్ శివన్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారు. రీసెంట్ గా వీరిద్దరూ మ్యారేజ్ చేసుకుని సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లి తండ్రులు అయినా విషయం తెలిసిందే. లేటెస్ట్ గా నయన్ తమ ఇద్దరు పిల్లలతో ఓనం ఫెస్టివల్ ను సెలబ్రేట్ చేసుకున్నారు. వీరు రెండు రోజులు ముందుగానే ఓనమ్ ఫెస్టివల్ ను జరుపుకున్నారు. నయనతార-విఘ్నేశ్ సినిమా కపుల్స్ అయినప్పటికీ..ట్రేడేషనల్ డ్రెస్సెస్ తో కనిపిస్తూ, తమ ఇద్దరి కుమారులకు ఓనం ఫెస్టివల్ యొక్క విశిష్టతను చూపిస్తున్నారు.
ఇక వీరిద్దరూ పేరెంట్స్ అయ్యాక వచ్చిన ఫస్ట్ ఫెస్టివల్ ఓనం కావడంతో..గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా తమ పిల్లలిద్దరిని సంప్రదాయ దుస్తుల్లో రెడీ చేసి, అరటి ఆకులో భోజనం తినిపిస్తూ ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఫ్యాన్స్ నుండి గ్రేట్ కపుల్స్ అంటూ విషెస్ తెలియజేస్తున్నారు. అయితే వీరిద్దరూ..కవల పిల్లలకు జన్మనిచ్చినప్పటి నుంచి వారి ముఖాన్ని ఫ్యాన్స్కు చూపించలేదు. ఇప్పుడు కూడా వారి ఫేస్ కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. వారిని వెనుక నుంచి ఫొటో తీశారు. ఇక వీరు సోషల్ మీడియాలో..ఉయిర్ (ప్రాణం), ఉలగం (ప్రపంచం)తో కలిసి మొదటి ఓనమ్ పండగ.. అని క్యాప్షన్ రాసుకొచ్చారు.
కేరళలో జరుపుకునే అతి ముఖ్యమైన పెద్ద పండుగల్లో ఓనమ్ ఒకటి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను ఎంత బాగా జరుపుకుంటామో కేరళలో అంతే సందడిగా ఓనమ్ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు.10 రోజుల ఓనం వేడుకల్లో భాగంగా తొలిరోజును అతమ్‌గా..చివరి రోజున తిరు ఓనమ్ వేడుకలను నిర్వహిస్తారు. ఈ రెండు రోజులు చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటారు.
ప్రస్తుతం షారుఖ్ ఖాన్ కు జోడీగా నయనతార జవాన్ మూవీలో నటిస్తుంది. ఈ మూవీలో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) విలన్ గా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రియమణి, సాన్య మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగిబాబు, రిధి డోగ్రా కీలకపాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్గా జవాన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 7న విడుదల కానుంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అడియన్స్ ముందుకు రానుంది.
എല്ലാവര്ക്കും എന്റെ ഹൃദയം നിറഞ്ഞ ഓണാശംസകൾ?
— Nayanthara✨ (@NayantharaU) August 27, 2023
Ellavarkkum Ente Hridayam Niranja Onaashamsakal?#HappyOnam?? pic.twitter.com/lFaluSsVyD