నయనతార 'కనెక్ట్' సస్పెన్స్ & హారర్ ట్రైలర్ రిలీజ్

నయనతార 'కనెక్ట్' సస్పెన్స్ & హారర్ ట్రైలర్ రిలీజ్

హారర్‌ మూవీస్‌తో ప్రేక్షకులను మరోసారి భయపెట్టడానికి వస్తోన్న లేడీ సూపర్ స్టార్ నయనతార. ఇప్పటికే పలు హారర్‌ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న నయన్.. తాజాగా కనెక్ట్ మూవీతో ప్రేక్షకులకు రాబోతున్నారు. ‘మయూరి’, ‘గేమ్ ఓవర్’ లాంటి సినిమాలు రూపొందించిన అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నయనతార స్వయంగా నిర్మిస్తున్న కనెక్ట్ చిత్రం ట్రైలర్ రిలీజైంది. ఇందులో చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ఇంటర్వెల్ లేకుండా 99నిమిషాలలో ఈ చిత్రాన్ని రూపొందించారు. డిసెంబర్‌ 22న థియేటర్లలో విడుదల కానున్న కనెక్ట్... తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. చిత్ర నిర్వాహకులు అర్థరాత్రి ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ ను విడుదల చేశారు. 2.22 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌.. ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ట్రైలర్‌ మొదటి నుంచి చివరి వరకు టెన్షన్‌ ఫీలింగ్ ను కలిగిస్తోంది. 

ఈ ట్రైలర్ ప్రకారం... కరోనా లాక్ డౌన్ సమయంలో నయన తార ఆన్‌లైన్‌ మీటింగ్‌లో పాల్గొంటుంది. అదే సమయంలో మీటింగ్ లో పాల్గొన్న వారికి ఎవరో తెలియని వ్యక్తి గొంతు వినిపిస్తుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు.. ? ఎవరు చేస్తున్నారు ఆ పని.. అసలెందుకు చేస్తున్నారు అన్న విషయాలను ఈ సినిమాలో చూపించినట్టు తెలుస్తోంది. అనుపమ్‌ ఖేర్‌ సైకియాట్రిస్ట్ పాత్రలో మెప్పించబోతున్నట్టు తెలుస్తోంది.  ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఇంటర్వెల్ లేకుండా తీయడంతో సినీ అభిమానులు రిలీజ్ కోసం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.