మెగా 157 షూట్‎లో నయనతార జాయిన్.. ముస్సోరీలో కీలక సన్నివేశాలు షూట్

మెగా 157 షూట్‎లో నయనతార జాయిన్.. ముస్సోరీలో కీలక సన్నివేశాలు షూట్

చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో శివ శంకర్‌‌‌‌ వర ప్రసాద్‌‌‌‌ పాత్రలో చిరంజీవి నటిస్తుండగా, ఆయనకు జంటగా నయనతార నటిస్తోంది. గత కొద్దిరోజులుగా ఉత్తరాఖండ్‌‌‌‌లోని ముస్సోరీలో షూటింగ్‌‌‌‌ జరుగుతోంది. తాజాగా నయనతార కూడా షూటింగ్‌‌‌‌లో జాయిన్ అయ్యింది. ప్రస్తుతం చిరు, నయన్‌‌‌‌ల మధ్య కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అలాగే ఓ పాటను కూడా చిత్రీకరించబోతున్నారు.   

సైరా నరసింహారెడ్డి, గాడ్‌‌‌‌ఫాదర్‌‌‌‌ తర్వాత చిరంజీవితో నయనతార నటిస్తున్న మూడో సినిమా కావడంతో  సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. చిరంజీవి కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది 157వ సినిమా. ఆయన ఇందులో డ్యూయల్ రోల్‌‌‌‌లో నటించబోతున్నట్టు ప్రచారంలో ఉంది. అందులో ఒకటి వింటేజ్‌‌‌‌ మెగాస్టార్‌‌‌‌‌‌‌‌ను గుర్తు చేసేలా ఉండబోతోందట. తన గత చిత్రాల తరహాలోనే ఫుల్ లెంగ్త్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్మెంట్‌‌‌‌తో అనిల్ రావిపూడి దీన్ని తెరకెక్కిస్తున్నాడు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై  సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది.  భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.