యూట్యూబర్తో నయనతార.. చాలా రిస్క్ ఏమో!

 యూట్యూబర్తో నయనతార.. చాలా రిస్క్ ఏమో!

ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ అంటే టక్కున గుర్తొచ్చేపేరు నయనతార(Nayanatara). నార్త్, సౌత్ అనే తేడా లేకుండా వరుస భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ.. హిట్స్ మీద హిట్స్ అందుకుంటోంది ఈ బ్యూటీ. ఇటీవల షారుఖ్(Shah rukh khan) హీరోగా వచ్చిన జవాన్(Jawan) సినిమాతో మరో భారీ విజయాన్ని అందుకుంది నయన్.

అంతేకాదు ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ కూడా భారీగానే అందుకుంటోంది నయనతార. రీసెంట్ గా వచ్చిన జవాన్ సినిమాకు ఏకంగా రూ.12 కోట్లు రెమ్యునరేషన్ అందుకుందనే వార్తలు వినిపించాయి.

లేటెస్ట్ గా నయన్..మరో కొత్త మూవీకి సైన్ చేసిందట. తమిళ్ ఫేమస్ యూట్యూబర్ డ్యూడ్ విక్కీ(Youtuber Dude Vicky) అందరికి తెలిసిందే. డ్యూడ్ విక్కీ డైరెక్షన్లో సినిమా చేయడానికి రెడీ అయ్యిందట నయనతార. విక్కీ ఇప్పటివరకు ఒక్క సినిమాకి కూడా డైరెక్షన్ చేసిన అనుభవం లేదు. మెగా ప్రాజెక్ట్స్ మూవీస్ చేసే నయనతార.. ఇప్పుడు ఏకంగా డైరెక్షన్ ఫీల్డ్లో లేని విక్కీ తో మూవీ చేయడం.. నయనతార ఫ్యాన్స్కు నచ్చట్లేదని టాక్. జవాన్ మూవీతో సక్సెస్ ట్రాక్ లో ఉన్న నయనతార.. ఇప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయడం కెరీర్ రిస్క్ లో పెట్టడమే అంటున్నారు.

లేటెస్ట్ గా ఈ కాంబో నుంచి వచ్చిన మోషన్ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ లో న్యాయ దేవత విగ్రహం చూపించడంతో..న్యాయ వ్యవస్థకి సంబంధించిన సినిమా అయి ఉంటుందని తెలుస్తోంది. పురాతన నాణాలతోపాటు కొత్త కరెన్సీ నోట్లు మట్టితో కప్పి ఉంచినట్లుగా డిజైన్ చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేస్తుంది. నయన్ సినిమా వస్తుందంటే..ఆడియాన్స్లో మంచి క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది.

ఈ మూవీకి మన్నన్ గట్టి అనే టైటిల్ రివిల్ చేస్తూ..Since 1960  అనే క్యాప్షన్ జోడిస్తూ త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. దీన్ని బట్టి మూవీ1960 బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా నయనతార ఫ్యాన్స్ కు ఎలాంటి ఫీల్ ఇస్తుందో చూడాలి మరి. 

ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్. లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. R.D రాజశేఖర్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా, సీన్ రోల్డెన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం జయం రవి హీరోగా ఐ అహ్మద్ డైరెక్ట్ చేస్తోన్న ఇరైవన్( Iraivan) మూవీ సెప్టెంబర్‌ 28న రిలీజ్ కాబోతుంది
 

  • Beta
Beta feature