'బాలకృష్ణ 107 మూవీకి టైటిల్ ఖరారు

'బాలకృష్ణ 107 మూవీకి టైటిల్ ఖరారు

నందమూరి బాలకృష్ణ 107 సినిమా టైటిల్ ను ప్రకటించారు. ‘వీరసింహారెడ్డి ’ గాడ్ ఆఫ్ మాసెస్ అంటూ టైటిల్ ను ఆవిష్కరించారు. కర్నూలులోని కొండారెడ్డి బురుజు సెంటర్ వద్ద సినిమా టైటిల్ లోగో ఆవిష్కరించారు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. టైటిల్ లోగో ఆవిష్కరణ కోసం.. కొండారెడ్డి బురుజు వద్ద ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు బాలకృష్ణ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొండారెడ్డి బురుజు ప్రాంతం జై బాలయ్య.. జైజై బాలయ్య  అనే నినాదాలతో ఆయన అభిమానులు హోరెత్తించారు. 

 

‘వీరసింహారెడ్డి ’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీలో బాలయ్య సరసన ‘శృతిహాసన్’ హీరోయిన్ గా నటిస్తున్నారు. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. నవీన్ యేర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్ తో సినిమాను రూపొందిస్తున్నారు. ఈ మూవీకి బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ అందించారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.