భారత్ లో పేదరికంపై ఎన్​సీఏఈఆర్ నివేదిక

భారత్ లో  పేదరికంపై ఎన్​సీఏఈఆర్ నివేదిక

రీ థింకింగ్​ సోషల్​ సేఫ్టీ నెట్స్​ ఇన్ ఏ చేంజింగ్​ సొసైటీ పేరుతో నేషనల్​ కౌన్సిల్​ ఆఫ్ అప్లయిడ్​ ఎకానమిక్స్​ రీసెర్చ్​ ఒక అధ్యయన పత్రాన్ని విడుదల చేసింది. సోనాల్డే దేశాయ్​ ఈ పత్రాన్ని రూపొందించారు. 

  •     ఇండియా హ్యూమన్​ డెవలప్ మెంట్​ సర్వే ఇటీవల పూర్తి చేసిన వేవ్​ 3తోపాటు గతంలోని వేవ్​ 1, 2 డేటాను ఈ పత్రం రూపొందించేందుకు వినియోగిస్తారు. 
  •     దేశంలో పేదరికం తగ్గిందని ఆర్థిక మేధో సంస్థ ఎన్​సీఏఈఆర్ విడుదల చేసిన అధ్యయన పత్రంలో వెల్లడించింది. 
  •     2011–12లో దేశంలో 21.2 శాతం పేదరికం ఉండగా, 2022–24 మధ్య 8.5 శాతానికి పరిమితమైందని పేర్కొంది. 
  •     కొవిడ్​ వంటి పరిణామాలు ఎదురైనా ఆ సవాళ్లన్నింటినీ తట్టుకుని దేశం ప్రగతిపథంలో ముందుకెళ్తున్నదని తెలిపింది. 
  •     ఐహెచ్​డీఎస్​ గుర్తించిన దాని ప్రకారం 2004–05లో దేశంలో పేదరికం 38.6 శాతం ఉండగా, 2011–12 నాటికి 21.2 శాతానికి తగ్గింది. ఒకవైపు కొవిడ్​ సవాళ్లు ఎదురైనా 2011–12 నుంచి 2022–24 నాటికి 8.5 శాతానికి పరిమితమైంది. 
  •     2024 ప్రారంభంలో నీతి ఆయోగ్​ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం కూడా వినియోగదారు వ్యయ సర్వే ప్రకారం దేశంలో పేదరికం 5 శాతం వరకు తగ్గి ఉంటుందని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు సుభిక్షంగా మారుతున్నారు.